నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించటం మామూలే. కానీ.. తాజా ఉదంతంలో ఈ ఫైన్ బారిన పడింది సాక్ష్యాత్తు ఎమ్మెల్యే, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కావటం విశేషంగా చెప్పాలి. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించటం చట్ట ప్రకారం నిషిద్ధం. అయితే.. రూల్స్ ను అతిక్రమించిన కారు ఎమ్మెల్యేది అయినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా జరిమానా విధించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జరిమానా పోటు పడిన ఎమ్మెల్యే ఎవరన్న విషయానికి వస్తే..
చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మాదాపూర్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నానక్ రాంగూడ సమీపంలోని టోల్ గేట్ దగ్గర పెట్రోల్ వాహనాల్ని ప్రారంభించే కార్యక్రమం జరిగింది. ఆ సమయంలోనే గచ్చిబౌలి నుంచి నానక్ రాంగూడ టోల్ గేట్ వైపునకు ఒక కారు రావటం.. దానికి బ్లాక్ ఫిలిం అంటించి ఉండటాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గుర్తించారు. ఆ వెంటనే కారును ఆపే ప్రయత్నం చేశారు.
డీసీపీ ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ ఐ విజయ్ మోహన్ సదరు వాహనాన్ని టోల్ గేట్ దగ్గర నిలిపి వేశారు. అయితే.. తాను ఎమ్మెల్యేనని కాలె యాదయ్య చెప్పుకున్నారు. అయితే.. అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని.. వదిలిపెట్టటం కుదరదని తేల్చి చెప్పటం.. ఫైన్ కట్టకుండా లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుపోవటంం ఎందుకన్న ఉద్దేశంతో ఫైన్ కట్టేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. మీడియా ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా రూల్స్‌ను బ్రేక్ చేసిన వాళ్లు ఎవరైనా ఫైన్ విధిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/