అతడి పేరు కళ్లేపల్లి ప్రేమ్ రాజ్. అతడు ఎవరి వద్దా అప్పు చేయలేదు. కానీ.. ఇసుక వ్యాపారం చేశాడు. తాను చేసే బిజినెస్ లో పెట్టుబడులు పెట్టమని ఫ్రెండ్స్ ను కోరగా వారు ఓకే అంటూ పెట్టబుడలు పెట్టారు. అలా పెట్టిన రూ.21 కోట్లు కట్టాల్సిన భారం అతడిపైన పడింది.
కారణం అతను ఇసుక వ్యాపారం చేయటమే. కోట్లాది రూపాయిల పెట్టుబడులు పెట్టిన అతనను.. తాను అప్పు తీసుకున్న డబ్బులకు లెక్క చెప్పాల్సి రావటం ఒక ఎత్తు అయితే.. అతడ్ని మోసం చేసిన వారి పుణ్యమా అని.. అతను 40 ఏళ్ల చిరు ప్రాయంలో ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఏపీ వ్యాప్తంగా సంచలంగా మారింది. అసలేం జరిగిందన్న విషయానికి వెళితే.. బీటెక్ చదివిన ప్రేమ్ రాజ్ ఐటీ ఉద్యోగిగా పని చేశాడు. ఆ సందర్భంలో ఆయనకు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు అయ్యాయి. దీంతో.. ఉద్యోగాన్ని కాదనుకొని జేపీ పవర్ వెంచర్స్ ప్రైవేటు సంస్థలో పశ్చిమగోదావరి ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇసుక వ్యాపారంలో భాగంగా రూ.25 కోట్ల భారీ మొత్తాన్ని కట్టిన ప్రేమ్ రాజ్ అందుకు తగ్గ అనుమతులు తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఒప్పందంలో భాగంగా ప్రతి నెల రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే.. వ్యాపారం సరిగా సాగకపోవటం.. ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కాస్తంత తగ్గింది. దీంతో.. ప్రతి నెలా కట్టాల్సిన రూ.21 కోట్లను కట్టలేని పరిస్థితి. గడిచిన మూడు నెలలుగా అతడు కట్టాల్సిన బకాయిలు పెండింగ్ లో పడ్డాయి.
ఒకవైపు బిజినెస్ అనుకున్నంతగా లేకపోవటం.. మరోవైపు ప్రతి నెలా కట్టాల్సిన భారం.. ఇంకోవైపు తనను నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వారికి సమాధానం చెప్పాల్సి రావటం. ఆ ఒత్తిడి రోజు రోజుకు పెరగసాగింది. దీంతో పెద్దలను కలిసిన అతను ఇసుక కాంట్రాక్టును తనకు ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడటం.. అందుకు సానుకూల స్పందన లేకపోవటంతో.. అడుగుకునే కన్నా ఆత్మహత్య చేసుకోవటం మంచిదన్న భావనతో ఆయన ప్రాణాల్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఆత్మహత్యకు రెండు రోజుల క్రితం విశాఖలో ఉండే తన స్నేహితుడైన గౌతంనుపిలిపించుకున్న ప్రేమ్ రాజ్.. తనను వ్యాపారంలో మోసం చేశారని.. తనకు కోట్లాది రూపాయిలు రావాల్సి ఉంటుందని.. తనను మోసంచేసినట్లుగా చెప్పుకొని ఆవేదన చెందినట్లుగా చెబుతున్నారు. వాకింగ్ అని చెప్పి.. కొవ్వూరు రైల్వే స్టేషన్ కు వెళ్లి.. రైలు కింద పడి తనువు చాలించాడు. ఆత్మహత్య చేసుకోవటానికి ఒక రోజు తన స్నేహితుడు గౌతంకు తనకు రావాల్సిన రూ.16 కోట్ల లెక్క చెప్పటంతో పాటు.. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వారి పేర్లు చెప్పినట్లుగా గౌతమ్ పేర్కొన్నారు. తనను వ్యాపారంలో మోసం చేయటంతోనే ఒత్తిళ్లు పెరిగినట్లుగా చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పు చేయకున్నా.. వ్యాపార ఒత్తిళ్లు ప్రాణాలు తీసిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.