తెలంగాణ 'లోక‌ల్ 'పై క్లారిటీ ఇచ్చేశారు

Update: 2017-07-13 05:56 GMT
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక‌త‌పై తాజాగా క్లారిటీ వ‌చ్చేసింది. ఎంబీబీఎస్‌.. బీడీఎస్ ప్ర‌దేశాల్లో స్థానికులుగా ఎవ‌రిని ప‌రిగ‌ణిస్తారు? అన్న సందేహానికి తాజాగా స‌మాధానం వ‌చ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థ‌ల్లో సీట్ల భ‌ర్తీపై 2024 వ‌ర‌కు ఉమ్మ‌డి ప్ర‌వేశాలు ఉండాల‌నే రూల్ నేప‌థ్యంలో వైద్య విద్య సీట్ల భ‌ర్తీలో లోక‌ల్ పై కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య వైద్య విశ్వ‌విద్యాల‌యం తాజాగా స్ప‌ష్ట‌త ఇచ్చేసింది.

స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ స‌మ‌యంలో అభ్య‌ర్థులు.. స్థానిక‌త.. కులం వివ‌రాలతో పాటు సంబంధించిన అన్ని ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్ని వెంట తెచ్చుకోవాల‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే స్థానిక‌త విష‌యం మీద వ‌ర్సిటీ ఇచ్చిన తాజా క్లారిటీ ఏమిటంటే.. అభ్య‌ర్థులు ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ స్ట‌డీ స‌ర్టిఫికేట్ల‌ను జ‌త చేయాల్సి ఉంటుంది.

అదే స‌మ‌యంలో అభ్య‌ర్థి కానీ.. అభ్య‌ర్థి త‌ల్లిదండ్రులు కానీ ప‌దేళ్ల‌పాటు తెలంగాణ‌లోనే నివ‌సించిన‌ట్లుగా త‌హ‌సీల్దారు జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పిస్తే.. దాన్ని లోక‌ల్ కింద లెక్క‌లోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు.తెలంగాణ‌లో నివ‌సించిన‌ట్లుగా ధ్రువీక‌రించే ప‌త్రంలో సంవ‌త్స‌రాల వివ‌రాల్ని స్పష్టం గా పేర్కొనాల‌ని వ‌ర్సిటీ పేర్కొంది. సో.. నాన్ స్టాప్ గా ప‌దేళ్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారు.. తెలంగాణ ప్రాంత స్థానికులుగా గుర్తింపు పొందే వీలుంద‌న్న మాట‌.
Tags:    

Similar News