మోడీ వద్ద అదానీ పేరు ఎత్తితే.. కవిత సంచలన ఆరోపణలు

Update: 2023-02-09 10:58 GMT
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ వర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. అధికార పార్టీ ససేమిరా అంటోంది. ప్రధాని మోడీ కూడా ఈ డిమాండ్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

మోడీ పార్లమెంట్ లో ప్రసంగించారు. అదానీపై ఉభయసభలను స్తంభింపచేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. వారిపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం మొత్తం కుంభకోణాల మయం అయ్యిందంటూ ఆరోపించారు. 2004-14 మధ్యకాలంలో యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుందని విమర్శించారు. యూపీఏ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు మినహా అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు.

గౌతం అదానీ విషయంలో తమ డిమాండ్లను ప్రధాని మోడీ సమాధానం ఇవ్వకపోవడం.. దాటవేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోడీ మాట్లాడుతున్న సమయంలో అదానీ అంశాన్ని పదేపదే గుర్తు చేశారు. వాటినేవీ ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు.

మోడీ ప్రసంగంలోపై భారత్ రాష్ట్రసమితి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని.. నిజాయితీని చాటుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే వారిపై మోడీ ఎదురుదాడికి దిగడంలో అర్థం లేదని పేర్కొంది. అదానీ పేరు ప్రధానిని ఎందుకు ఇంతగా ఇరిటేట్ చేస్తోందని ప్రశ్నించింది.

మోడీ ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం లేదని.. చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారని.. ప్రతిపక్షాలపై సెటైర్లు సంధించారని.. ఇది ఆయన హోదాకు తగదని చెప్పారు.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News