తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అన్ని పార్టీలూ మేనిఫెస్టోలను విడుదల చేయడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే.. తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ తన ఎన్నికల ప్రణాళికను విడుదలను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం సైతం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు చర్యలు ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఎంఎన్‌ఎం చీఫ్ కమల్ హాసన్ విడుదల చేస్తూ గృహిణుల ఆదాయం పెంచుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ప్రతినెలా రూ 10,000 నుంచి రూ 15,000 వరకూ సంపాదించుకునేలా వారికి వివిధ నైపుణ్యాలను అందించేలా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. యువతకు 50 లక్షల ఉద్యోగాలను తమ పార్టీ అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రకటించారు. యువ వాణిజ్యవేత్తలకు రాయితీలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉద్యోగులను వాటాదారులుగా చేర్చితే అవి లాభాలబాట పడతాయని అన్నారు. మరోవైపు ఎంఎన్ ఎం ఆలోచనలను డీఎంకే కాపీ కొడుతూ తమ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిందని కమల్ హాసన్ ఇటీవల ఆరోపించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో మోనో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తాము రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఏఐఏడీఎంకే, డీఎంకే కాపీ కొట్టాయని కమల్ హాసన్ విమర్శించారు. ప్రతినెలా మహిళలకు 1000 నుంచి 1500 రూపాయల మేర నగదును ఇవ్వాలనే ప్రణాళిక తమదేనని, తాను గత డిసెంబర్ లోనే దీనిపై ఓ ప్రకటన చేశానని గుర్తు చేశారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ..తోటి నటుడు శరత్ కుమార్ స్థాపించిన ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చితో కలిసి పోటీ చేస్తోంది.