బిగ్ బాస్2పై కేసు.. చిక్కుల్లో స్టార్ హీరో

Update: 2018-08-02 11:24 GMT
బిగ్ బాస్ 2 చిక్కుల్లో పడింది. రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు చేయడంతో కేసు నమోదైంది. తమిళంలో నిర్వహిస్తున్న బిగ్ బాస్2కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ నోరు జారీ ఇరుక్కుపోయారు.  బిగ్ బాస్ 2 నిర్వాహకులతోపాటు షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీలపై చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు అందింది. ఉద్దేశపూర్వకంగానే కమల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలూ వినిపించాయి.

ఇటీవల తమిళ బిగ్ బాస్ 2లో ఓ టాస్క్ జరిగింది. నియంతగా ఓ కంటెస్టెంట్ వ్యవహరించాల్సి వచ్చింది. శని - ఆదివారాలు వచ్చిన హోస్ట్ కమల్.. దీన్ని ఉదహరిస్తూ.. ‘రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో దీన్ని బట్టి అందరూ చూశారని ’ పేర్కొన్నాడు. దీనిపై హర్ట్ అయిన న్యాయవాది లూయిసాల్ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దివంగత ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే నాయకురాలు జయలలితను నియంతగా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ షోలో జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రియాలిటీ షో హోస్ట్ కమల్ - బిగ్ బాస్ 2 తమిళ నిర్వాహకులు - షో ప్రసారం చేస్తున్న స్టార్ విజయ్ టీవీ చానెళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు..
Tags:    

Similar News