విశ్వనటుడు కమలహాసన్ డబుల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అటు నటన, ఇటు రాజకీయాలపై దృష్టిసారించారు. తన రోజు వారీ కార్యక్రమంలో భాగంగా ఉదయం సినిమా షూటింగ్, మధ్యాహ్నం నుంచి తన పార్టీ కార్యక్రమాల పై సమీక్షిస్తూ బీజీగా గడుపుతున్నారు.
కమలహాసన్ ఇటీవల ముక్కల నీది మయ్యం పార్టీ స్థాపించిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు శాయశక్తులా పాటుపడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నారు. గ్రామసభలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
రాజకీయాలపై దృష్టిసారించిన కమల హాసన్ ఇండియన్-2 చిత్రం తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. ఈచిత్రం గత 18న ప్రారంభమై నిరాటకంగా కొనసాగుతుంది. శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఇండియన్-2 చిత్రం తన రాజకీయాలకు ఉపయోగపడేలా కమల్ హాసన్ చూసుకుంటున్నారు. ఈ సినిమా 22ఏళ్ల కిత్రం వచ్చి ఘన విజయం సాధించిన ఇండియన్ చిత్రానికి స్వీకెల్ గా వస్తుంది.
దర్శకుడు శంకర్ చిత్రం తరహాలోనే ఇందులో అంతర్జాతీయ సమస్య ప్రధానంశంగా తీస్తున్నట్లు సమాచారం. ఇండియన్-2 లో కమల్ సేనాధిపతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం కమల్ ఉదయం 6గంటలకే షూటింగ్ కు వచ్చి మూడుగంటల పాటు మేకప్ కే టైమ్ కేటాయిస్తున్నారు. 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
మధ్యాహ్నం నుంచి కమల్ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. రాత్రి 10గంటల వరకు పార్టీ నిర్వాహాకులు, కార్యకర్తలతో బీజీగా గడుపుతున్నారు. ఇలా రోజుకు 16గంటల వరకు ఆయన శ్రమిస్తున్నారు. జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న కమలహాసన్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ నిర్వాహాకులు మాత్రం మక్కల్ నీది మయ్యం పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కమల్ హాసన్ ఈ జోడు గుర్రాల స్వారీ కలిసొస్తుందా? లేదో వేచి చూడాల్సిందే.
Full View