మాట ఏదైనా సరే.. ముఖం పగిలిపోయేలా మాట్లాడటం కొందరికి అలవాటు. అయితే.. అవసరమైన సందర్భాల్లో మాత్రం మాట్లాడే తత్త్వం కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. తనను ఇబ్బంది పెట్టాలన్నా.. తనను దెబ్బ తీయాలన్న ప్లాన్ చేయటం కానీ.. ఇరికించే ప్రయత్నం చేసినా.. తన స్వేచ్ఛను.. ఆత్మాభిమానాన్ని ఏ మాత్రం తగ్గించుకోవటానికి ఇష్టపడని తారల్లో ప్రముఖురాలిగా చెప్పాలి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్.
బాలీవుడ్ లాంటి పురుషాధిక్య ఇండస్ట్రీలో ఆమెకంటూ ఆమె పేరు తెచ్చుకోవటమే కాదు.. బ్రాండ్ గా ఎదిగిన తీరును మర్చిపోలేం. పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టినా.. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లటం కంగనా స్పెషల్ గా చెప్పాలి. ప్రస్తుతం దేశాన్ని చుట్టేసిన పొలిటికల్ హీట్ నేపథ్యంలో రాజకీయాల గురంచి రియాక్ట్ అయ్యారు కంగనా. తనను చాలానే పార్టీ అప్రోచ్ అయ్యాయని ఆమె వెల్లడించారు.
చాలా పార్టీలు మంచి అవకాశం ఇస్తామని చెప్పాయి. కానీ.. నేను ఒక పార్టీ తరఫున మాట్లాడినా.. ప్రచారం చేసినా.. అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతాను. అందుకే తాను తన స్వేచ్ఛను వదులుకోవటానికి ఇష్టపడలేదని చెప్పారు. తన తాత సర్జుసింగ్ రాజ్ పుత్ హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ లీడర్ గా పని చేసినట్లు చెప్పారు.
ప్రజలు.. భాగస్వాములు.. బంధాలు..ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని.. అందుకే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నట్లు ఆమె చెప్పారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే నిస్వార్థంగా పని చేస్తానని.. పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పటికిప్పుడు కాకున్నా.. తన పొలిటికల్ ఎంట్రీ అన్నది ఎప్పటికైనా ఖాయమన్న విషయాన్ని ఎంత తెలివిగా చెప్పిందో కదూ?