హెచ్‌ సీయూలో మళ్లీ ఉద్రిక్త‌త‌

Update: 2016-03-22 12:01 GMT
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మరోమారు వార్త‌ల్లోకి ఎక్కింది. పీహెచ్‌ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య స‌మ‌యంలో వీసీగా ఉన్న‌ అప్పారావు తిరిగి వైస్ చాన్స‌ల‌ర్‌ బాధ్యతలు స్వీకరించటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ చాంబర్‌ ఎదుట విద్యార్థులు ఆందోళన చేసి ఈ  సందర్భంగా ఫర్నీచర్‌ ను ధ్వంసం చేశారు. రోహిత్ ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ విద్యార్థులు వీసీ ఇంటిపైనా దాడి చేశారు. హెచ్‌ సీయూలో నెల‌కొన్న ఈ గందరగోళాన్ని సరిదిద్దేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వ‌చ్చింది.

ఇదిలాఉండ‌గా జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ రేపు హైదరాబాద్‌ రానున్నారు. హెచ్‌ సీయూలో జరిగే రోహిత్‌ సంతాప సభలో ఆయ‌న‌ పాల్గొంటారు. మ‌రో రోజు ఇక్క‌డే బ‌స చేసే క‌న్న‌య్య గురువారం వామపక్ష పార్టీల‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో పాల్గొంటారు. కన్నయ్యకుమార్‌ పర్యటనకు సంబంధించి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష నేతలు ఈ ఏర్పాట్ల గురించి వివ‌రించారు.
Tags:    

Similar News