కంప్యూటర్ యుగంలో కాలుపెట్టి, చంద్రమండలంపై మానవులు ప్రయాణిస్తున్న నేటి సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. నేటి సమాజంలో కొన్ని సంఘటనల్ని చూస్తుంటే మనం కంప్యూటర్ యుగంలో ఉన్నామా లేక రాతియుగంలో ఉన్నామా అనే అనుమానం కలుగక మానదు.
సాధారణంగా పెళ్లి తరువాత జరిగే శోభనం తంతుపై వధువు - వరుడి ఇద్దరికి భయం భయంగానే ఉంటుంది. అయితే ఇద్దరు మనసులు కలవాలంటే శోభనం తప్పని సరి. అయితే అలా మనసులు మనువాడాల్సిన చోట ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. అలా అనుమానిస్తే శోభనం జరిగేది . లేదంటే ఆ శోభనం రాత్రి కాల రాత్రిగా మిగిలిపోతుంది.
మహారాష్ట్రలోని కంజర్ భట్స్ అనే సామాజిక వర్గం లో ఓ మూఢ నమ్మకం జడలు విప్పి నాట్యం చేస్తుంది. కన్యత్వం పేరుతో రాజస్థాన్ నుంచి మహారాష్ట్రకు వచ్చిన వీరు సాంప్రదాయం పేరుతో యువతులను హింసిస్తున్నారు. దీనికి అమ్మాయి - అబ్బాయి తరుపు వారు - కుల పెద్దలు మద్దతు పలుకుతున్నారు.
కంజర్ భట్స్ వర్గం వారు పెళ్లి తరువాత జరిగే శోభనం తంతులో వధువు వెన్నులో వణుకు పుట్టించేలా కఠిన శిక్షలు విధిస్తారు. ఓ వైపు జీవితాంతం గుర్తిండి పోయే ఓ అనుభూతి కి దగ్గర అవుతున్నా..తంతు ముగిసిన తరువాత ఏం జరుగుతుందోనన్న భయం వెరసీ తొలిరేయిని ఆస్వాధించాలనుకునే వధువు పెళ్లి పాన్పే ముళ్ల పాన్పుగా దర్శనమిస్తుంది.
ఆ సామాజిక వర్గం వారు పెళ్లి తరువాత జరిగే శోభనం లో అమ్మాయికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. శోభనం గదిలోకి వెళ్లే ముందు వధువుకు ఓ తెల్లటి వస్త్రాన్ని ఇచ్చి లోపలికి పంపిస్తారు. ఆ లోపలి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమ్మాయి తరుపు కుటుంబసభ్యులు - అబ్బాయి తరుపు కుటుంబసభ్యులు - ఆ ఊరి పెద్దలు ఆ గది బయటే కాపలా కాస్తారు. ఆ తంతు ముగిసిన తరువాత పెళ్లి కూతురు కన్యత్వం గురించి పెళ్లి కొడుకును ఆరాతీస్తారు. పెళ్లికొడుకు బ్లీడింగ్ మరక ఉందని చెబితే అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటారు. అదే బ్లీడింగ్ మరకలేదంటే వధువు పారాణి ఆరక ముందే ఆమెను గ్రామస్తుల సమక్షంలో చెట్టుకు కట్టేసి చెప్పులతొ కొడతారు. లేని పోనివి అంటగడుతూ రాక్షసానందాన్ని పొందుతుంటారు. ప్రపంచం ఇంత పురోగతిని సాధించిన ప్రస్తుత తరుణంలోనూ.. నిండా ఛాదస్తపు భావాలను పులుముకున్న వీరి గురించి పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.
అంతేకాదు ఈ వర్గం వారిపై పలువురు వైద్యులు మండిపడుతున్న వధువుకు శోభనం రాత్రిలో బ్లీడింగ్ రాకపోతే కన్యత్వం పోయినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. శోభనంలో బ్లీడింగ్ రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. చిన్న వయసులో సైకిల్ తొక్కడం - గోడలు దూకడం - ఆటలు ఆడడం వల్ల బ్లీడింగ్ అసాధ్యమని - ఆ విషయం తెలుసుకోకుండా వధువుని చిత్ర హింసలకు గురిచేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు.