వేడెక్కుతున్న కర్ణాటకం..రాజ‌కీయాల్లోకి ఆ హీరో

Update: 2018-04-02 17:41 GMT
పొరుగు రాష్ట్రమైన కర్ణాట‌క‌లో ఎన్నిక‌ల రాజ‌కీయం జోరు పెరుగుతోంది. ఓవైపు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ వేడిని పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఆ రాష్ట్రంలోని పాతుఉక‌పోయిన పార్టీలు సైతం ఎన్నిక‌ల వ్యూహాన్ని మొద‌లుపెడుతున్నాయి. సినీ ప్ర‌ముఖుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నాయి.  కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జేడీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు హెచ్‌.డి ​​కుమార స్వామితో సమావేశం అవ‌డం ఇందుకు ఊత‌మిచ్చింది.

మాజీ ప్ర‌ధాని, జేడీఎస్‌ అధినేత దేవగౌడ సుదీప్‌ని గ‌తంలో పార్టీలోకి ఆహ్వానింఆచారు. అయితే ఆ స‌మ‌యంలో సుదీప్ ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ అనూహ్య రీతిలో తాజాగా దేవ‌గౌడ త‌న‌యుడు కుమార‌స్వామితో భేటీ అయ్యారు. దీంతో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ మొద‌లైంది. తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే కుమార‌స్వామితో భేటీ అయ్యాన‌ని సుదీప్ చెప్తుండ‌గా...దాదాపు రెండు గంట‌ల పాటు ఆయ‌న రాజ‌కీయాలు చ‌ర్చించార‌ని జేడీఎస్ వ‌ర్గాలు అంటున్నాయి.

మ‌రోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జోరు పెంచారు. గత మూడు రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన.. మైసూరుతో పాటూ పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రముఖ మఠాలను సందర్శిస్తూ.. మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సుట్టూర్ మఠాన్ని సందర్శించిన అమిత్ షా.. పీఠాధిపతి దేశికేంద్ర మహాస్వామీజిని కలిశారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తో పాటూ, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, పలువురు నేతలున్నారు.
Tags:    

Similar News