క‌ల్వ‌ర్ యాత్ర‌పై పూలు చ‌ల్లిన పోలీసు..వైర‌ల్!

Update: 2018-08-09 16:46 GMT
ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాధ్ కోసం అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. యోగి ద‌ళిత వాడ‌ల్లో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో ....అక్క‌డి ప్ర‌జ‌ల‌కు స‌బ్బులు పంపిణీ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అమ‌ర‌వీరుడి ఇంటికి యోగి ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన సంద‌ర్భంగా....అక్క‌డ ఏసీ....ఏర్పాటు చేయ‌డం అధికారుల‌ను విమ‌ర్శ‌ల‌పాలయ్యేలా చేసింది. యోగి కూడా త‌న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. తాజాగా, యూపీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న మ‌రోసారి యోగి పేరు వార్త‌ల్లో నిలిచేలా చేసింది. మీర‌ట్ లో జ‌రుగుతున్న‌ కన్వర్ యాత్ర సంద‌ర్భంగా యాత్రలోని ప్ర‌జ‌ల‌పై గులాబీ రేకులు చల్లేందుకు యోగి స‌ర్కార్ 14లక్షలు పెట్టి హెలికాఫ్టర్‌ ను అద్దెకు తీసుకోవ‌డం సంచ‌ల‌నం చేపింది. అంతేకాకుండా - హెలికాప్ట‌ర్ నుంచి గులాబీ రేకులను మీరట్ జోన్ అడిషనల్ డీజీ ప్ర‌శాంత్ కుమార్ యాత్రపైకి విసురుతుండటం వివాదాస్ప‌ద‌మైంది.

ఆ యాత్ర కోసం రూ.14 ల‌క్ష‌లు పెట్టి హెలికాఫ్టర్ ను యోగి స‌ర్కార్ అద్దెకు తీసుకుంది. జూలై 28న యోగీ ఆదిత్యనాథ్ హెలికాఫ్టర్‌ లో ప్రయాణిస్తూ యాత్రికుల‌పై గులాబీ రేకులు విసిరారు. దానిని అనుస‌రించిన డీజీ అదే త‌ర‌హాలో గులాబీ రేకులు విసిరారు. అయితే, యాత్ర‌పై నిఘా ఉంచి భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారి ప్రశాంత్ కుమార్ పూలు విసురుతున్న వీడియో వైరల్ అయింది. డ్యూటీ చేయాల్సిన అధికారులు డ్యూటీ తప్ప అన్ని చేస్తున్నారంటూ నెటిజ‌న్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతోపాటు యాత్ర జ‌రుగుతున్న రోడ్డులో మాంసాహారం విక్రయిస్తున్న దుకాణాలు, హోటళ్లను మూయించేశారు. జాతీయ రహదారిపై వాహనాలను దారి మ‌ళ్లించడంపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ఇందులో  మతపరమైన కోణం లేదని ప్ర‌శాంత్ వివరణ ఇచ్చారు. శివ భక్తులకు స్వాగతం పలకడానికే పూలు చల్లినట్టు తెలిపారు. పోలీసు వ్య‌వ‌స్థ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుందని - రంజాన్‌ - బక్రీద్‌ - జైనుల‌ పండుగల్లో తాము పాలుపంచుకుంటామని అన్నారు.
Tags:    

Similar News