జనసేన అధినేతగా.. పవర్ స్టార్ గా సుపరిచితులైన పవన్ కల్యాణ్ మీద ఆయన సొంత సామాజిక వర్గమైన కాపులు కొందరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావటానికి కాపు అయినప్పటికీ తాను కులం చట్రంలో బందీని కాదని పవన్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కులం.. మతం.. ప్రాంతం లాంటి వాటిల్లో కూరుకుపోనని.. తాను జాతీయవాదినని వ్యాఖ్యానించటం తెలిసిందే.
గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన.. అనంతరం చోటు చేసుకున్న హింసాకాండ తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో హింసాకాండ జరిగిన నేపథ్యంలో కేరళ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ రియాక్ట్ కావటం.. ఆఘమేఘాల మీద హైదరాబాద్ కు వచ్చి మీడియాతో మాట్లాడటం.. కాపు గర్జన నేపథ్యంలో జరిగిన వ్యవహారాల మీద రియాక్ట్ కావటం.. ఉద్యమాలు హింసాత్మకంగా మారితే ఆశయాన్ని సాధించటం అసాధ్యంగా మారుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తన దారిన తాను వెళ్లటం తెలిసిందే.
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న అంశంపై పవన్ నుంచి ఎంతో ఆశించిన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.. పవన్ రియాక్షన్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ పై పవన్ నుంచి మరింత స్పందనను కోరటంతో పాటు.. వ్యక్తిగతంగా ఇన్ వాల్వ్ అయి.. బీసీల్లోకి చేర్చే విషయంలో ఆయన గళం విప్పాలని ఆశించారు. అయితే.. ఇలాంటి విషయాల మీద తాను పోరాడలేనన్న విషయాన్ని చెప్పేసిన పవన్.. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై వారి చేస్తున్న డిమాండ్ లో న్యాయం ఉందన్న మాటను చెప్పారు.
అయితే.. పవన్ రియాక్ట్ అయిన తీరుకు కాపువర్గానికి చెందిన కొందరు హర్ట్ కావటమే కాదు.. ఆందోళనలు మొదలు పెట్టారు. గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో పవన్ మీద ఆగ్రహంతో ఆయన ఫ్లక్సీల్ని.. కటౌట్లను చించేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరిని నొప్పించకుండా వ్యవహరించాలని బావించే పవన్.. కాపుల అగ్రహాంపై ఎలా రియాక్ట్ అవుతారో..?