ఎమ్మెల్యే కరణం బలరాం వెనక్కి తగ్గడానికి కారణం అదేనా ..ఏంటంటే !

Update: 2020-03-12 07:15 GMT
స్థానిక సంస్థల ఎన్నికలవేళ తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో కీలకమైన, సీనియార్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీ వైసీపీలోకి క్యూ కడుతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డి లు జగన్ సమక్షం లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కలరణం బలరామకృష్ణమూర్తి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌ ను కలిసేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం కొద్దిసేపటి క్రితమే అమరావతికి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. బలరాం తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జగన్ సమక్షం లో కరణం బలరాం కొడుకు వెంకటేష్‌ వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తుంది. అయితే, ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రం, వైసీపీ లో చేరడం లేదు అని తాజా సమాచారం.

ఎందుకు అంటే ...అయన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈ సమయంలో వైసీపీ కండువా కప్పుకుంటే , అయన పై అనర్హత వేటు అవకాశం ఉంది. దీనితో అయన పై అనర్హత వేటు పడకుండా కేవలం.. సీఎం వైఎస్ జగన్‌ ను కలవడం, చర్చలు జరపడం వరకే కరణం బలరాం పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే, సీఎం జగన్‌తో సమావేశం, చర్చల తర్వాత, పరిస్థితిని బట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని అంటున్నారు బలరాం. మొత్తంగా సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన ఎమ్మెల్యే కరణం బలరాం, ఇప్పుడు టీడీపీ కి గుడ్ బై చెప్పి ..వైసీపీ లో చేరబోతుండటం టీడీపీకి ప్రకాశం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
Tags:    

Similar News