బీజేపీ పుట్టి ముంచిన మూడు కార‌ణాలు.. క‌ర్ణాట‌క‌లో ఘోర వైఫ‌ల్యం!

Update: 2023-05-13 17:00 GMT
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీకి చావు త‌ప్పిన ప‌రిస్థితి క‌నిపించింది. అంటే.. ఘోర వైఫ‌ల్యాన్ని మూట‌గ‌ట్టుకోకుండా.. అంతో ఇంతో కొన్ని సీట్ల‌ను ద‌క్కించుకున్నామ‌నే సంతృప్తి మిగిలింది. వాస్త‌వానికి వ‌రుస ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయాల‌న్న‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంక‌ల్పానికి తోడు క‌ర్ణాట‌క వంటి కీల‌క‌మైన ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయ‌డం ద్వారా.. క‌మలం పార్టీని పుంజుకునేలా చేయాల‌ని .. వ్యూహాలు వేశారు.

అయితే.. కేవ‌లం 68 స్థానాల‌కే ఇప్పుడు ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే.. ప్ర‌స్తుతం బీజేపీ వైఫ‌ల్యానికి కార‌ణాలు అన్వేషిస్తే.. ప్ర‌ధానంగా మూడు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి కీల‌క‌మైన ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేయ‌డం.. రెండు రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం క‌మీష‌న్ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌న్న విమ‌ర్శ‌లు.. వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల పెద‌వి విరుపుల‌ను కూడా ప‌ట్టించుకోకుండా.. ఎదురు దాడి చేయ‌డం.. మూడు కీల‌క‌మైన లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌గ‌దీష్ శెట్ట‌ర్‌ను పార్టీ నుంచి అవ‌మాన‌కరంగా బ‌య‌ట‌కు పంపేయడం వంటివి క‌మ‌ల నాథుల‌కు కోరి తెచ్చుకున్న వైఫల్యాలుగా చెబుతున్నారు.

కీల‌క‌మైన ముస్లింలకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ‌తంలో 4 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. అయితే.. దీనిని ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు నెల‌ల ముంద బొమ్మై ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీనిని కాంగ్రెస్ అందిపుచ్చుకుని తాము అధికారంలోకి వ‌స్తే.

6 శాతం చేస్తామ‌ని ఇచ్చిన హామీ బాగా ముస్లిం వ‌ర్గాల్లో ప‌నిచేసింది. ఇక‌, లింగాయ‌త్ ఓట్లు త‌మ‌కే ప‌డ‌తాయ‌ని చెప్పిన క‌మ‌ల నాథులు.. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ సీఎం జ‌గ‌దీష్ శెట్ట‌ర్‌కు టికెట్ ఇవ్వ‌కుండా అవ‌మానించార‌నేది ఆ సామాజిక‌వ ర్గం ఓట్ల‌ను దూరం చేసింది.

అదేస‌మ‌యంలో ఊరూ వాడా కూడా.. రాష్ట్రంలో అవినీ తిప్ర‌భుత్వం పాలన‌చేస్తోంద‌ని చెప్పినా.. మోడీ వంటివారు వినిపించుకోలేదు. పైగా ఎదురు దాడి చేశారు. వీటికితోడు.. కొత్త‌ముఖాల‌ను ప‌రిచ‌యం చేస్తున్నామ‌నే  పేరిట సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం కూడా.. క‌లిసి రాలేదు. మొత్తంగా చూస్తే.. బీజేపీ త‌న వైఫ‌ల్యాల‌కు త‌గిన మూల్యం చెల్లించుకుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Similar News