బీజేపీ పాలిస్తున్న కర్ణాటకలో ఎన్నికలకు నగరా మోగింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల ఈసీఐ బుధవారం తేదీలను వెల్లడించింది. కర్ణాటకలో మే 10న ఒకే దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
దక్షిణాదిలో బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2018 ఎన్నికలలో 224 సభ్యుల అసెంబ్లీలో 104 సీట్లు గెలుచుకుని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకోగా, జనతాదళ్ (సెక్యులర్) సంఖ్య 37కి చేరుకుంది. అయితే ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ మరియు జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, తరువాతి హెచ్‌డి కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
జూలై 2019లో, కొంతమంది కాంగ్రెస్-జెడి(ఎస్) శాసనసభ్యుల తిరుగుబాటుతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుంచి బిఎస్ యడ్యూరప్ప సీఎంగా బిజెపి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. జూలై 2021లో, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మార్గం కల్పించడానికి యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
-ఈసారి కర్ణాటకలో గట్టి పోటీ..
బీజేపీ దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక కీలకం. మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ జాతీయ పార్టీల హవా నడుస్తోంది. జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది కర్నాటకలోనే. అటు కాంగ్రెస్ పార్టీకి సైతం క్షేత్రస్థాయిలో బలం ఎక్కువ. జాతీయ అధ్యక్షుడు మల్లఖార్జున కార్గే సొంత రాష్ట్రం కూడా. మొన్నటికి మొన్న రాహుల్ జోడో యాత్ర కర్నాటకలో సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు. 224 స్థానాలకుగాను 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మొత్తానికి నడి వేసవిలో కర్నాటక ఎన్నికలు దక్షిణాది రాష్ట్రాల్లో హీట్ పెంచనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.