మే 23. ఈ తేదీ గురించే దేశం యావత్తు దేశం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. దేశంలో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా ప్రతిపక్ష కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందా.? ఈ రెండు కాకుండా హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.
అయితే మే 23 ఫలితాలతో పాటు కర్ణాటకలో రాజకీయ వేడి కూడా రాజుకుంది.. దేశ ఫలితాలతోపాటే కర్ణాటకలో కూడా ప్రభుత్వం ఉంటుందా.? కూలుతుందా అనేది స్పష్టమవుతోంది. అదే సమయంలో జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ వెంటే నడుస్తుందా.? లేదా బీజేపీ వైపు టర్న్ అవుతుందా అనేది కూడా సందేహంగా మారింది. మొత్తంగా కన్నడలో మాత్రం మే 23తో ప్రభుత్వం కూలిపోవడమా కాదా అనేది స్పష్టమవుతోంది.
మే 23 కేంద్రంగా కన్నడ నాట రాజకీయ వేడి ముందే రాజుకుంటోంది. మే 21వ తేదీన ఇటు జేడీఎస్, అటు బీజేపీ లు తమ శాసనసభ్యులతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలందరూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి రావాలని జేడీఎస్ అధినేత హెచ్.డీ దేవెగౌడ పిలుపునిచ్చారు. ఇక కర్ణాటక ప్రభుత్వం మే 23 తర్వాత కూలుతుందని ప్రకటించిన కర్ణాటక బీజేపీ బాధ్యులు యడ్యూరప్ప 21నే బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇలా లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే కర్ణాటక రాజకీయాలు రసవత్తంగా మారాయి.
కాగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలపై భేటిపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారు..? కేంద్రంలో తమకు జేడీఎస్ మద్దతిస్తుందా అనేదానిపై ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జారకి హోళీ షాకిచ్చాడు. తాను 23వ తేదీన కాంగ్రెస్ ను వీడేది లేనిది తేలుస్తానని ప్రకటించారు. ఆయనతోపాటు పదిమంది వరకూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం మే 23న కూలిపోతుందా అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కర్ణాటకలో జేడీఎస్ -కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటున్నారు. లేదా కాంగ్రెస్ వస్తే మాత్రం కన్నడలో ప్రభుత్వం కొనసాగే అవకాశాలుంటాయి. మొత్తంగా మే 21న కీలక సమావేశాలు కన్నడ రాజకీయాలనే కాదు.. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.