కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద అల్లుడు విరూపాక్ష యమకనమరాది ఏకంగా పోలీసులతోనే చెడుగుడు ఆడిన వ్యవహారం కర్ణాటకలో వివాదాస్పదమైంది. సీఎం తన మామ అంటూ పోలీసులతోనే ఘర్షణకు దిగారు. బెలగావిలోని ప్రభుత్వ అతిథి గృహంలోంచి బయటకు వెళ్తున్న సీఎం అల్లుడిని నెమ్మదిగా వెళ్లమని అక్కడున్న పోలీసులు సూచించారు. అయితే పట్టించుకోకుండా పోవడంతో పోలీసులు కారును అడ్డుకున్నారు.
దీంతో తన కారునే ఆపుతారా అంటూ సీరియస్ అయిన సీఎం అల్లుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పరుష పదజాలంతో పోలీసులపై తిట్ల వర్షం కురిపించాడు.
అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు సీఎం అల్లుడు, పోలీసులను శాంతింప చేసి ఘర్షణను తగ్గించారు. అక్కడి నుంచి ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు.
అయితే పోలీసులతో ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం అల్లుడు ఆగడాలు అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం యడ్యూరప్పకు చిక్కులు తెచ్చిపెట్టింది.
Full View