మొన్నటిదాకా సీనియర్ ఐఏఎస్ అధికారిగా - ఆ తర్వాత నిన్నటిదాకా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించి... నిన్న చంద్రబాబు సర్కారు చేత గెంటేయబడ్డ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్కే అయ్యింది. ఎక్కడ చూసినా ఈ వ్యవహారంపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో ఉండి ఐవైఆర్... చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్టా?... ఆయనను ఉన్నపళంగా పదవి నుంచి తొలగించిన చంద్రబాబు సర్కారు చర్య కరెక్టా? అన్న విషయాలపై ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు.
కాకతాళీయమో... ఏమో తెలియదు గానీ... సర్కారుకు వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసే ఉద్యోగులపై కర్ణాటక సర్కారు కత్తి దూసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు వారం క్రితం కర్ణాటక ప్రభుత్వం తన ఉద్యోగులందరినీ ఓ సర్క్యూలర్ జారీ చేసేసింది. సదరు సర్క్యూలర్‌లో చాలా అంశాలను పేర్కొన్న సిద్దరామయ్య సర్కారు... సరికొత్త అంశాన్ని చేర్చేసింది. ఆ అంశమేంటంటే... ప్రభుత్వం విధాన నిర్ణయాలను, ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసే ఉద్యోగులకు వేతన పెంపు ఉండదట. ఒకసారి ఇలా పట్టుబడే ఉద్యోగులకు... వారు పట్టుబడినప్పటి నుంచి రెండేళ్ల దాకా అసలు ఇంక్రిమెంట్లే వేయరట.
అంటే నోటికి తాళమేసుకుని... ప్రభుత్వం ఏది చేసినా డూడూ బసవన్నలా తలూపుతూ పనిచేసుకుపోయే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పడుతున్నా... ప్రభుత్వ చర్యలను విమర్శించే ఉద్యోగులకు మాత్రం రెండేళ్ల దాకా అసలు వేతనాల పెంపే ఉండదట. ఉద్యోగుల నియమావళిలో ఇప్పటిదాకా ఈ తరహా నిబంధన లేదనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియమావళిలోనూ ఈ నిబంధన కనిపించదు.
అందుకేనేమో... కర్ణాటక సర్కారు ఈ కొత్త నిబంధనను చేరుస్తూ తన ఉద్యోగులందరికీ ఈ విషయం తెలిసేలా అన్ని శాఖలకు ప్రత్యేకంగా సర్క్యూలర్ జారీ చేసిందట. అంటే ఇకపై సిద్దరామయ్య సర్కారు తీసుకునే నిర్ణయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విమర్శించడానికి వీల్లేదన్న మాట. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా... ఈ విషయం మరిచిపోయి ఏదో టీవీ చర్చలో పాల్గొన్న సందర్భంలోనే, లేదంటే తమ అసోసియేషన్ సమావేశాల్లోనో నోరు జారి... ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తే... సదరు ఉద్యోగికి ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/