సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినపుడు ఒకరికొకరు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అదే విడాకుల తీసుకున్న భార్యాభర్తల సంగతి చెప్పనవసరం లేదు. విడిపోయాక భార్యాభర్తలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. ఒకరి యోగ క్షేమాల గురించి మరొకరు అస్పలు పట్టించుకోరు. అయితే, కర్ణాటకకు చెందిన ఓ భర్త తన మాజీ భార్యకు వేరేవ్యక్తితో దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాడు. అంతేకాదు, కొత్త దంపతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన పెళ్లి కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది.
చింతామణి పట్టణంలోని అశ్విని లేఅవుట్ కు చెందిన రచనకు చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరగౌడతో 15 ఏళ్ల క్రితం వివాహమయింది. రచన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని భావించారు.
గత ఏడాది డిసెంబర్ లో భర్త ఈశ్వరగౌడ నుంచి రచన విడాకులు తీసుకొని ఆమె బాబు, పాపతో విడిగా ఉంటున్నారు. ఆ తర్వాత రచనకు ఆమె స్వయంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్ గా పని చేస్తున్న మంజునాథ్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అయితే, రచన తన మాజీ భర్త ఈశ్వర్ గౌడకు ఈ పెళ్లి విషయం చెప్పారు. దీనికి అంగీకరించిన ఈశ్వర్ గౌడ వారిద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించారు. మాజీ భర్త సహకారంతో రచన ఇంట్లోనే ఆమె, మంజునాథ్‌లు దండలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్త దంపతులు ఈశ్వరగౌడ ఆశీర్వాదం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.