రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కర్నాటక అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ అస్త్రం ఏమిటి ? మొన్నటి కర్నాటక ఎన్నికల్లో అర్హులైన పేదలందరికీ ఉచిత బియ్యం లేదా అందుకు సమానమైన డబ్బులను ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనేక కారణాల వల్ల కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. వెంటనే పేదలకు బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే అందరికీ ఇచ్చేందుకు బియ్యం దొరకలేదు.
పంజాబ్ నుండి బియ్యాన్ని సేకరించాలని అనుకున్నా సాధ్యంకాలేదు. దాంతో ఆ ప్రయత్నాన్ని వదిలేసి పేదలు ఎన్ని కిలోల బియ్యాన్ని తీసుకుంటున్నారో అందుకు సమానవిలువైన డబ్బును జమచేయాలని డిసైడ్ చేసింది. అంట కిలోకి సుమారు 35 రూపాయలు ఇస్తున్నారు. ఎన్ని కిలీల బియ్యం అయితే అంత డబ్బు పేదల ఖాతాల్లో జమవుతుందన్నమాట. ఈ పద్దతి బాగా వర్కవుటవుతోందని ప్రభుత్వంకు ఫీడ్ బ్యాక్ అందుతోంది.
బియ్యం సేకరించటం ప్రతి సీజన్లోను ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. అదే డబ్బిచ్చేస్తే ఏ సమస్యా ఉండదు. పైగా బియ్యాన్ని తీసుకుంటున్న పేదల్లో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు తక్కువేనట. బియ్యాన్ని తీసుకుంటున్న పేదల్లో అత్యధికులు వెంటనే అదే డీలర్ కు అమ్మేస్తున్నారట.
అందుకనే బియ్యం ఇచ్చేబదులు అదేదో ప్రభుత్వమే డబ్బిచ్చేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుకున్నారట. అనుకున్నట్లే డబ్బిచ్చేయటం మొదలుపెట్టారు. ఇదే విధానాన్ని దేశమంతా అమలుచేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటిస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం.
ఇక దీనికి అదనంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల లాంటి హామీలను ప్రకటిస్తే మహిళల ఓట్లు కాంగ్రెస్ కే పడే అవకాశముందని కాంగ్రెస్ ఆశిస్తున్నది. ఎందుకంటే కర్నాటకలో మహిళలు కాంగ్రెస్ క ఓట్లేశారు కాబట్టి.
బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నది కర్నాటకలో సూపర్ హిట్టయిందనే చెప్పాలి. ఎందుకంటే రోజులో లక్షల్లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దీని దెబ్బకు ప్రైవేటు సర్విసులు, మెట్రో సర్వీసుల్లో ఆక్యుపెన్సీ బాగా పడిపోయిందట. దీన్నే జాతీయస్ధాయిలో మ్యానిఫెస్టోగా ప్రకటిస్తే పార్టీకి ఊపొస్తుందని అనుకుంటున్నారు. చివరకు ఏమిచేస్తారో చూడాలి.