ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్.. హాట్ గా సాగుతున్నాయో తెలిసిందే. విపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని.. ప్రతిపక్షం సంధించే ప్రతి ప్రశ్నకు సమాధానం తమ దగ్గర ఉందని ఏపీ ముఖ్యమంత్రి చెప్పినా.. ఆయన మాటలకు భిన్నమైన పరిస్థితి ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయిన కొద్ది గంటలకే చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక.. సోమ.. మంగళవారాల్లో ఏపీ అసెంబ్లీలో తెలంగాణ అధికారపక్షం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో తమ గురించి ప్రస్తావించటాన్ని తెలంగాణ అధికారపక్షం నేతలు తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర మంత్రుల గురించి మాట్లాడితే ఖబడ్డార్ అంటూ హెచ్చరిస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు.
ఏపీ ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. బాబు ముమ్మాటికి దొంగే అంటూ టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీలో తెలంగాణ అధికారపక్షంపై ఓ రేంజ్ లో వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీలో ‘‘అంతకు మించి’’ ప్రస్తావన ఉండటం.. కడిగేయటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.