తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి రైతు యాత్ర చేస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తుంటే టీడీపీ అడగడుగునా అడ్డుతగులుతోందనని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ - పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రాజెక్టుల కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేశారని, ఇందులో భాగంగానే భూసేకరణ జరిపారని వివరించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అందుకే చంద్రబాబును కాలకేయుడు అని చెప్పుకోవచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో 15 వేల మంది తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయన్ని టీటీడీపీ నేతలు ఎందుకు మర్చిపోయారని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు నిలదీశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యకు కారణం టీడీపీ కాదా? అని నిలదీశారు. కరెంట్ ఛార్జీలను తగ్గించమంటే కాల్చి చంపిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ నేతలు పాదయాత్రల పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారని అడిగారు. టీడీపీ నేతలు ముక్కునేలకు రాస్తూ పాదయాత్రలు చేస్తే తప్ప ప్రజలు సహించే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల కట్టాలని ప్రయత్నించినా, సంక్షేమ పథకాలను ప్రారంభించినా, ఆఖరికి సమగ్ర కుటుంబ సర్వే వంటివి చేపట్టినా అడ్డం పడటం తెలుగుదేశం పార్టీకి అలవాటు అయిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం రీత్యా సచివాలయం పునర్ నిర్మిస్తామని చెప్తుంటే కూడా కోర్టులను ఆశ్రయించడం టీడీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు అన్ని సంక్షేమ పనులే చేస్తుంటే, నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఎందుకు ఉందని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో సొంత ప్రయోజనాల కోసం స్విస్ చాలెంజ్ విధానం తీసుకువచ్చారని హైకోర్టు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అన్నారు. పోలవరం టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని ఎందుకు తేలుతుందని నిలదీశారు. చంద్రబాబు చేస్తేనే సంసారం అవుతుంది ఇతరులు చేస్తే వ్యభిచారమా అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటులో దొరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజల ముందుకు ఎలా వెళ్లాలనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/