కర్నె కారణంగా కేసీఆర్ కు 120 డిగ్రీల జ్వరం?

Update: 2015-09-30 04:25 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడైన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. తన స్వామి భక్తిని చాటుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు. గొప్పలు చెప్పే నాలుక స్లిప్ అయి అంకె మారటంతో అప్పటివరకూ గంభీరంగా ఉన్న సభ కాస్త ఘోల్లుమంది. కర్నె మాటల బడాయి ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయం తెలిపే పరిస్థితి.

మంగళవారం మండలి సమావేశంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కర్నె  ప్రభాకర్ సీరియస్ గా మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యల గురించి నాన్ స్టాప్ గా మాట్లాడుతున్న ఆయన.. రైతుల కోసం తమ అధినేత కేసీఆర్ ఎంత కష్టపడతారో చెప్పుకునే ప్రయత్నంలో ఒక ఉదాహరణ చెప్పుకుచ్చారు. ఆవేశం మంచిదే కానీ.. శృతి మించితే నాలుక జారుతుందన్న విషయం కర్నెకు తాజాగా తెలిసి ఉంటుంది.

ఎలా అంటే.. తెలంగాణ రైతాంగ పరిరక్షణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ ఎంతగా కష్టపడిందన్న విషయాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నంలో.. నాడు కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంలో బాధపడుతూ మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో పాదయాత్ర చేశారని చెప్పటం అందరిని ఒక్క షాక్ గురి చేసింది.

105 డిగ్రీలు దాటితే మనిషి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అలాంటిది 120 డిగ్రీలంటూ కర్నె చెప్పేయటంతో.. నాలుక జారాడన్న విషయం అర్థమై.. సభ ఘెల్లుమంది. 102 డిగ్రీల జ్వరంలో కేసీఆర్ పాదయాత్ర చేయబోయారని చెప్పబోయి.. 120 డిగ్రీలు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. తన తప్పును గుర్తించిన కర్నె.. తన మాటల్ని సవరించుకుంటూ 120ను కాస్తా 102 డిగ్రీలుగా చెప్పుకున్నా.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కర్నె పుణ్యమా అని కేసీఆర్ కు 120 డిగ్రీల జ్వరం వచ్చిందే అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసుకోవటం కనిపించింది.
Tags:    

Similar News