చిదంబ‌రం కొడుక్కి దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది

Update: 2017-08-15 04:29 GMT
యూపీఏ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన కేంద్ర ఆర్థిక శాఖా మాజీ మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి సుప్రీంకోర్టులో దిమ్మ తిరిగిపోయే ఎదురుదెబ్బ ఒక‌టి త‌గిలింది. అవినీతి కేసుల్లో సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా ఫారిన్‌ కు వెళ్లొద్దంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం క్లారిటీ ఇచ్చేసింది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని నిలిపివేస్తూ మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పైనా స్టే విధించింది.

కార్తీ చిదంబ‌రం దోషా?  కాదా? అన్న విష‌యం జోలికి తాము వెళ్ల‌టం లేద‌ని.. కార్తీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా?  విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తారా?  లేదా? అన్న అంశాన్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సీబీఐ కోరింద‌ని.. అయినా హాజ‌రు కాలేద‌ని.. మొద‌ట విదేశాల్లో ఉన్నార‌ని చెప్పార‌ని.. అక్క‌డి నుంచి వ‌చ్చాక కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేదంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్‌.. జ‌స్టిస్ డీవై చంద్ర‌బూడ్ ల ధ‌ర్మాస‌నం పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

కార్తీ అరెస్ట్ కుఎలాంటి ఉత్త‌ర్వులు లేవ‌ని.. అత‌న్ని అరెస్ట్‌ చేసే ఆలోచ‌న కూడా లేద‌న్న అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది. కార్తీ త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను నిరూపించుకోవ‌టానికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు పేర్కొంది. విచార‌ణ‌కు ఎందుకు దూరంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించిన న్యాయ‌స్థానం.. ఎఫ్ ఐఆర్ ను ర‌ద్దు చేయాల‌ని మాత్ర‌మే మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించార‌న్నారు. సాధార‌ణంగా ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తార‌ని..కార్తీ మాత్రం అలా చేయ‌ల‌దేని.. అంటే.. అరెస్ట్ గురించి భ‌య‌ప‌డ‌టం లేదుగా అన్న కోర్టు.. విచార‌ణ‌కు ఎప్పుడు హాజ‌ర‌వుతారో టైం చెప్పాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  విదేశాల‌కు వెళ్ల‌కూడ‌దంటూ ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ కేసును కోర్టు ఉద‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం. మ‌లేసియాకు వెళ్లేందుకు అనుమ‌తించిన వ్య‌క్తులు తిరిగి రాలేద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. కొంద‌రు ప్ర‌ముఖ వ్య‌క్తుల‌కు విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి విష‌యంలో కోర్టుకు చాలానే చేదు అనుభ‌వాలు ఉన్నాయ‌ని.. అలా వెళ్లిన వారు ఇంకా తిరిగి రాలేద‌ని పేర్కొంది. ఊహించ‌ని రీతిలో సుప్రీం రియాక్ట్ అయిన తీరు కార్తీ చిదంబ‌రానికి మింగుడుప‌డ‌ని రీతిలో త‌యారైంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News