ఫ్యామిలీల్ని టచ్ చేస్తే అంతేనంటూ వార్నింగ్

Update: 2017-03-09 06:40 GMT
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు ఇటీవల చేస్తున్న చేష్టలకు ఆ రాష్ట్ర పోలీసులకు సరికొత్త షాకింగ్ గా మారుతున్నాయి. టార్గెట్ చేసి మరీ.. కశ్మీరీ పోలీసుల ఇళ్లను గుర్తించి మరీ.. పోలీసుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అంతేనా.. దోపిడీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ఉగ్రవాదులు.. మీ వాళ్లను పోలీస్ జాబ్స్ కు రిజైన్ చేయమని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ.. రిజైన్ చేయకుంటే అంతే సంగతులంటూ హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు దాదాపు పదికిపైనే చోటు చేసుకున్నాయట. దీంతో కశ్మీర్ పోలీసుల్లో సరికొత్త భయాందోళనలు మొదలైనట్లు చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి మరింత ముదిరితే.. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని గుర్తించిన పోలీస్ బాస్ గట్టి వార్నింగ్ కు తెర తీశారు. మాకే కాదు.. మీకూ ఫ్యామిలీస్ ఉన్నాయ్.. మా ఫ్యామిలీస్ జోలికి వస్తే.. మేం కూడా మీ ఫ్యామిలీస్  విషయంలోకి వెళతామంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

అనవసరంగా పోలీసుల కుటుంబాల జోలికి రావొద్దని.. వారిని సమస్యల్లోకి లాగొద్దంటూ కశ్మీరీ పోలీస్ బాస్ వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసు ఫ్యామిలీస్ ను వేధిస్తే.. తాము కూడా అదే తరహాలో ఉగ్రవాదుల కుటుంబాల్ని వేధిస్తామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా మరో పోలీసు ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు.. సొత్తును దోచుకోవటమే కాదు.. పోలీసు ఉద్యోగం మాన్పించాలని వార్నింగ్ ఇవ్వటంతో జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేడ్ రంగంలోకి దిగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News