కరోనా వైరస్ విస్తరణతో దేశంలో లాక్ డౌన్ విధించారు. మెల్లిమెల్లిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అందరినీ ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వం ఆదేశించింది. బయటకు వెళితే పోలీసోళ్లు ఇరక్కొట్టేస్తున్నారు. దీంతో ఎలా తమ స్వస్థలాలకు వెళ్లాలో తెలియక జనాలు నరకయాతన పడుతున్నారు.
ఈ క్రమంలో ఓ ఆస్పత్రిలో చిక్కుకుపోయిన కశ్మీర్ యువకుడు తన ఊరికి వెళ్లడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. లాక్ డౌన్ తో వెళ్లడం సాధ్యం కాకపోవడంతో తనే చనిపోయినట్టే డెత్ సర్జిఫికెట్ సృష్టించి అంబులెన్స్ లో బయలుదేరాడు.
కశ్మీర్ లోని పూంచ్ జిల్లాకు చెందిన హకామ్ దిన్ ఇటీవల గాయపడ్డాడు. ఆస్పత్రి లో చేరాడు. గాయం తగ్గి డిశ్చార్జ్ చేశారు. అయితే లాక్ డౌన్ తో తన సొంతూరు వెళ్లలేని పరిస్తితి. దీంతో తన ముగ్గురు స్నేహితులను పిలిచాడు. తన ప్లాన్ చెప్పాడు. బతికుండగానే హకామ్ తాను చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ ఫేక్ ది సృష్టించాడు. ఓ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి సొంతూరుకు శవంలా పడుకొని బయలు దేరాడు.
అయితే మధ్యలో ఆపిన పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయగా.. హకామ్ బతికున్నట్టు గుర్తించారు. దీంతో హకామ్ తోపాటు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. డెత్ సర్జిఫికెట్ సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.