తెలుగు టీవీ ఛానళ్లను చూసే వారికి కాశ్మీర్ లో సాగుతున్న ప్రస్తుత రచ్చ గురించి పెద్దగా సమాచారం తెలిసే అవకాశమే లేదు. అదే సమయంలో ఇంగ్లిష్.. హిందీ ఛానళ్లను ఫాలో అయ్యేవారు మాత్రం కాశ్మీర్ అంశం మీద కొంత అవగాహన కలిగి ఉండటం ఖాయం. ఇంతకీ కాశ్మీర్ లో ఏం జరిగింది..? ఏం జరుగుతోంది?
తాజా ఆందోళన ఎక్కడ.. ఎలా మొదలైందని చూస్తే.. ఆదివారం భారత్.. పాకిస్థాన్ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి రావాలంటూ కశ్మీరీ వేర్పాటువాదులకు పాక్ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్ అజీజ్ పిలుపునివ్వటంతో వివాదం రాజుకుంది. ఢిల్లీలో సమావేశానికి పాక్ అధికారులు అతిధులైతే.. వారు.. కాశ్మీర్ వేర్పాటు నేతల్ని రమ్మని ఆహ్వానించటంలో అర్థం లేదు. దీనిపై వివాదం సాగుతుంటే.. మరోవైపు.. కాశ్మీర్ పోలీసుల ఓవర్ యాక్షన్ అగ్నికి ఆజ్యం పోసేలా చేసింది.
పాక్ భద్రతా సలహాదారు ఇచ్చిన పిలుపుతో హురియత్ నేతలు ఢిల్లీకి వెళతారన్న సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి కాశ్మీర్ లాంటి సున్నిత రాష్ట్రంలో ముఖ్యనేతల్ని అదుపులోకి తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.
అయితే.. పోలీసుల ఓవర్ యాక్షన్ తో హురియత్ నేతలైన మిర్వాజ్.. గిలానీ.. అన్సారీ.. యాసిన్ మాలిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. నిజానికి వారేం అప్పటికప్పుడు కాశ్మీర్ ను విడిచి వెళ్లటం లేదు. ఒకవేళ వెళ్లే ప్రయత్నంచేస్తే వారిని అదుపులోకి తీసుకున్నా బాగుండేది. కానీ.. అదేమీ లేకుండా పోలీసుల అత్యుత్సాహం వారిని గృహనిర్భంధానికి కారణమైంది.
దీంతో.. విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగటంతో నేతల్ని అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల వ్యవధి లోనే విడుదల చేశారు. వారి ప్రయాణాల మీద పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పనేదో మొదటే చేసి ఉంటే బాగుంది. కానీ.. దూకుడుగా వ్యవహరించి విమర్శల్ని పోలీసులు మూటగట్టుకున్నారు.