సైనికుల్ని సొంత ప్ర‌జ‌లే కొట్టినా కిమ్మ‌న‌లేదు

Update: 2017-04-14 17:13 GMT
చేతిలో తుపాకీ. కానీ.. కిమ్మ‌న‌లేదు. త‌మ‌ను తిట్టేస్తూ.. కొట్టేస్తున్న సొంత ప్ర‌జ‌ల‌న ఏమీ అన‌కుండా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్న మ‌న సైనికుల సంయ‌మ‌నం ఇప్పుడు జాతి జ‌నుల మ‌న‌సుల్ని దోచుకుంటోంది. క‌శ్మీర్ లో జ‌రిగిన తాజా ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా క‌శ్మీరీ ప్ర‌జ‌లు ప‌లువురు చేసిన చేష్ట‌ల‌కు సైనికులు ఎలాంటి స్పంద‌న లేకుండా.. త‌మ‌కు జ‌రుగుతున్న అవ‌మానానికి కించిత్ కూడా స్పందించ‌కుండా అపూర్వ‌మైన సంయ‌మ‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. సైనికుల ఓర్పును ప‌లువురు విమ‌ర్శిస్తూ..అంత‌లా చెల‌రేగిపోతున్న వారిపై కాల్పులు జ‌రిపితే స‌రిపోయేద‌న్న మాట‌ల్ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

శ్రీన‌గ‌ర్ లోక్ స‌భా స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న హింస‌తో ఎన్నిక వాయిదా ప‌డ‌టం తెలిసిందే. తాజాగా జ‌రిగిన రీ పోలింగ్ కు అత్య‌ల్పంగా పోలింగ్ న‌మోదైంది. ఉప ఎన్నిక స‌మ‌యంలో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌నల్లో కాల్పులు జ‌రిపిన భ‌ద్ర‌తా సిబ్బంది కార‌ణంగా ఎనిమిది మంది క‌శ్మీరీలు మ‌ర‌ణించారు. దీనిపై వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆదివారం జ‌రిగిన ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన త‌ర్వాత త‌మ విధుల్ని ముగించి.. ఈవీఎంల‌ను తీసుకొస్తున్న సైనిక సిబ్బందిపై అక్క‌డి ప్ర‌జ‌లు దాడి చేశారు.

వారిని తిడుతూ.. కొట్టారు. వారిని సూటిపోటీ మాట‌ల‌తో ఏడిపించారు. అజాద్.. గో బ్యాక్ లాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు.. నినాదాలు చేశారు. అంతేకాదు.. అన్నింటికంటే దారుణంగా అజాద్ అనాల‌ని సైనికుల మీద ఒత్తిడి చేసి.. వారి చేత అలాంటి మాట అనిపించేలా చేశారు. ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా మాట్లాడ‌ని సైనికులు.. త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునే ప్ర‌య‌త్నం చేశారే త‌ప్పించి.. అస్స‌లు స్పందించ‌లేదు.

దీనికి సంబంధించిన వీడియో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీన్ని చూస్తున్న వారంతా తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సైనికుల్ని ఇంత‌గా అవ‌మానిస్తున్నారా? అని మండిప‌డ‌ట‌మే కాదు.. సైనికులు త‌మ ద‌గ్గ‌రి ఆయుధాల్ని ప్ర‌యోగించాల్సిందంటూ ఆవేశంతో వ్యాఖ్యానిస్తున్నారు. కానీ.. అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంటే భారీ జ‌న‌న‌ష్టం వాటిల్లేద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు.  ఏమైనా.. సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో రెచ్చిపోకుండా అపూర్వ‌మైన సంయ‌మ‌నాన్ని ప్ర‌ద‌ర్శించిన సైనికుల‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. క‌శ్మీరీ ప్ర‌జ‌లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌టానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే.. ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న హింసను అదుపు చేసే ప‌నిలో భాగంగా జ‌రిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మ‌ర‌ణించ‌టంతో.. అక్క‌డి స్థానికులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ఈ ఉప ఎన్నిక‌ల్లో అత్య‌ల్పంగా పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News