తెలుగుదేశం.. బీజేపీల మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతుందా? అన్న ప్రశ్నకు అవునన్న సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ రెండు మిత్రపక్షాల మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ స్టాండ్ భిన్నంగా ఉండటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. మిత్రపక్షం మీద విమర్శలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇదిలా ఉంటే.. తమ పార్టీ మీద చేస్తున్న విమర్శలపై ఏపీ బీజేపీ నేతలు రగిలిపోతున్నారు.
మాటకు మాట అనకపోతే ఎలా అన్నట్లుగా వారి వైఖరి ఉంది. ఏపీ ప్రజల ప్రయోజనాల కంటే కూడా పార్టీ అధినాయకత్వానికి అండగా ఉన్నామన్న భావన కలిగించేందుకే వారు ప్రాధాన్యత ఇవ్వటంతో.. తమపై మాటల దాడి చేస్తున్న తెలుగు తమ్ముళ్లపై వారు విరుచుకుపడుతున్నారు. పనిలో పనిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయటం గమనార్హం. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేశ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు చంద్రబాబు మీద విమర్శలు చేయటమే కాదు.. ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఇమేజ్ ను చూసి.. టీడీపీ నేతలు తమతో పొత్తు పెట్టుకునేందుకు వెంటపడినట్లుగా వారు వ్యాఖ్యానించారు. మోడీ ఇమేజ్.. పవన్ కల్యాణ్ మద్ధతు లేకుండా ఉంటే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేదా? అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ తరహా విమర్శలు మిత్రుల మధ్య మరింత దూరాన్ని పెంచటం ఖాయం.
కలిసి పోటీ చేసి విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని ఉమ్మడిగానే స్వీకరించాలే తప్పించి.. మేం గొప్ప అన్నట్లుగా మాట్లాడటంలో అర్థం లేదన్నది ఏపీ కమలనాథులు గుర్తిస్తే మంచిది. అదే సమయంలో కమలనాథుల మాటల్లో వస్తున్న మార్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్న మాటను పలువురు చెబుతున్నారు. మిత్రపక్షంగా మేలు కోరాల్సింది పోయి.. అధికారపక్ష మర్యాద పోయేలా మాట్లాడుతున్న మాటలపై చంద్రబుబ దృష్టి సారిస్తే మంచిదని చెబుతున్నారు.
ఇక.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అధినాయకత్వం మీద ఏపీ కమలనాథులు ఒత్తిడి తేవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అధినాయకత్వం అడుగులకు మడుగులు వత్తేలా వ్యవహరిస్తున్న తీరును సీమాంధ్రులు సహిస్తారనుకోవటం కలే అవుతుంది. అధినాయకత్వం మెప్పు కోసం.. ఏపీ ప్రజల మద్దతు కోల్పోవటం మంచిదా? అన్నప్రశ్నను ఏపీ కమలనాథులు ఎవరికి వారు వేసుకోవటం మంచిది. ఈ విషయంలో తీసుకునే నిర్ణయానికి ముందు.. ఇదే తరహాలో వ్యవహరించిన ఏపీ కాంగ్రెస్ నేతలు తీరు ఇప్పుడెలా తయారైందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.