ఎప్పటిలానే ఆ యువరాణి ఫోటోలు దిగింది. తన ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లకు ఆమె ఫోజులిచ్చారు. తాను పాల్గొనాల్సిన కార్యక్రమంలో పాల్గొన్న యువరాణి.. తన పని తాను ముగించుకొని వెళ్లిపోయారు. యువరాణిగారి ఫోటోలు తీసుకున్న మీడియా వాళ్ల దారిన వారు వెళ్లిపోయారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ యువరాణి ఎవరు? ఆమెకు సంబంధించిన బయటకు వచ్చిన ఆసక్తికర అంశం ఏమిటన్నది చూస్తే.. నిజంగానే ఇది చాలా చిత్రమైన అంశంగా చెప్పాలి. ఎందుకంటే..
ఎవరికైనా చేతి వేళ్లు ఎలా ఉంటాయి? మొదటి మూడు వేళ్లు తీసుకుంటే.. చూపుడువేలు.. మూడో వేలు ఇంచుమించు ఒకే సైజులో ఉంటే.. మధ్య వేలు మాత్రం పొడుగ్గా ఉంటుంది. ఇది అందరికి కామన్. కానీ.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్ టన్ చేతివేళ్లు అందుకు భిన్నమన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇప్పటికి ఆమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు తీసినప్పటికీ.. ఇప్పుడు గుర్తించిన విషయం ఇంతకు ముందు ఎప్పుడూ వెల్లడికాలేదు.
యువరాణి మూడు వేళ్లు ఒకే సైజులో ఉండటం విచిత్రంగా మారింది. మిగిలిన వారి మాదిరి కాకుండా.. ఆమె చేతి వేళ్లు ఒకేలా ఉండటం ఎలా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. తాజాగా ఆమె ఒక చారిటి సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పర్సునుపట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేతివేళ్లను దగ్గర దగ్గరగా పెట్టుకొని పట్టుకోవటంతో ఆమె చేతివేళ్లు ఒకే సైజులో ఉన్న విషయాన్ని గుర్తించారు.
మూడు వేళ్లు ఒకే పొడవులో ఉండటంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన కేట్.. తాజాగా గర్భవతిగా ఉన్నారు. యువరాణి చేతివేళ్లపై బ్రిటన్ మీడియా భారీ ఎత్తున కథనాలు అచ్చేస్తోంది. ఇక.. డెయిలీ మొయిల్ అయితే ఎందుకు కేట్ వేళ్లు సమానంగా ఉన్నాయంటూ భారీ కథనాన్నే అచ్చేసింది. ఇక.. మిగిలిన టాబ్లాయిడ్ లు సైతం ఇదే అంశంపై భారీగా కథనాల్ని ప్రచురిస్తున్నాయి.