పుకార్లకు చెక్: కత్తి మహేష్ కు ప్రాణాపాయం లేదు

Update: 2021-06-29 05:30 GMT
మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అన్నీ అవాస్తవాలేనని తేలింది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ ను చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ ఎడమ కన్ను పూర్తిగా కోల్పోయాడని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లకు తాజాగా క్లారిటీ వచ్చింది.

కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లను ఆయన సన్నిహితులు ఖండించారు. కత్తి మహేష్ చాలా వరకూ కోలుకున్నారని.. తల నుదిటి భాగంలో ఎముక విరిగిందని తాజాగా దానికి శస్త్ర చికిత్స చేశారని తాజాగా కొంత మంది దళిత నాయకులు, సన్నిహితులు తెలిపారు. వారు చెన్నై వెళ్లి కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు.

ఇక కంటికి బలమైన గాయం కావడంతో సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని.. త్వరలోనే కత్తి మహేష్ పూర్తిగా కోలుకొని తిరిగి హైదరాబాద్ రాబోతున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

కత్తి మహేష్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News