బ‌హిష్క‌ర‌ణ వేటుపై కోర్టు ద్వారా క‌త్తి ఫైట్‌!

Update: 2018-07-17 04:47 GMT
త‌న‌ను హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రించిన వైనంపై సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ తాజాగా రియాక్ట్ అయ్యారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌కున్నా.. బ‌హిష్క‌ర‌ణ వేటు వేయ‌టం స‌రికాద‌న్నారు. శ్రీ‌రాముడిపై తాను చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌న‌సుతో కాకుండా మెద‌డుతో ఆలోచించాల‌న్న ఆయ‌న‌.. అలా చేస్తే.. మ‌నోభావాలు దెబ్బ తినే ప‌రిస్థితి త‌ప్పుతుందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌పై విధించిన బ‌హిష్క‌ర‌ణ వేటుపై కోర్టులో న్యాయ‌పోరాటం చేస్తాన‌ని చెప్పారు. గౌర‌వ‌ప్ర‌దంగా తాను హైద‌రాబాద్‌ లో అడుగు పెడ‌తాన‌ని చెప్పారు. త‌న చిన్న‌నాటి మిత్రుడైన ఏజీపీ అయిన వ‌ల్లెపు చిన్న‌రెడ్డ‌ప్ప‌ను పీలేరులో క‌లుసుకున్న క‌త్తి మ‌హేశ్‌.. ఆ త‌ర్వాత ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి ఉంది.

అయితే.. క‌త్తిని అడ్డుకునేందుకు సంఘ్‌.. వీహెచ్ పీ నేత‌లు వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా క‌త్తి వ‌ద్ద‌కు వెళ్లారు. పీలేరు ప‌ట్ట‌ణాన్ని వ‌దిలివెళ్లాల‌ని.. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌న్న పోలీసుల మాట‌తో తాను బెంగ‌ళూరు వెళ్ల‌నున్న‌ట్లుగా క‌త్తి పేర్కొన్నారు. ఈ వైనంపై తాజాగా క‌త్తి సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. చిత్తూరు జిల్లా పీలేరులో వీహెచ్ పీ మూక‌ల దాడి య‌త్నాన్ని ముందుగా ప‌సిగ‌ట్టి.. చాక‌చ‌క్యంగా ఏపీ పోలీసులు త‌న‌ను సుర‌క్షితంగా క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించిన‌ట్లుగా పేర్కొన్నారు. టీడీపీ.. బీజేపీ స్నేహం కార‌ణంగా ఏపీలో హిందుత్వ శ‌క్తులు బ‌ల‌ప‌డ్డాయన‌టానికి తాజా ఉదంతం నిద‌ర్శ‌నంగా పేర్కొన్న ఆయ‌న‌.. ఇలాంటి ప‌రిస్థితే రానున్న రోజుల్లో కొన‌సాగితే ప్ర‌మాద‌మ‌న్న హెచ్చ‌రిక‌ను చేశాడు. ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లాను వ‌దిలివెళ్లాల‌న్న పోలీసుల మాట‌ల్ని త‌న‌దైన శైలిలో క‌త్తి ట్విస్ట్ చేసి వ్యాఖ్యానించార‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News