పోలీసుల అదుపులో క‌త్తి మ‌హేశ్‌?

Update: 2018-07-03 03:57 GMT
అందుకే చెప్పేది మాట్లాడేట‌ప్ప‌డు కాస్త సంయ‌మ‌నం అవ‌స‌ర‌మ‌ని. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొవ‌టం ఖాయం. మ‌నసులోని అభిప్రాయాలు చెప్పుకోవ‌టానికి రాజ్యాంగం ఇచ్చిన భావ‌స్వేచ్ఛ ఎంత ఉందో.. అదే స‌మ‌యంలో త‌మ మాట‌ల‌తో ఎదుటివారి మ‌నోభావాలు నొచ్చుకోకూడ‌ద‌న్న బాధ్య‌త కూడా ప్ర‌తి ఒక్క‌రి మీద ఉంద‌న్న విష‌యాన్ని మేధావులు.. ప్ర‌ముఖులు మ‌ర్చిపోకూడ‌దు.

ఇలా మ‌ర్చిపోయి మాట్లాడిన‌ క‌త్తి మ‌హేశ్‌ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఛాన‌ల్ ను వేదిక‌గా తీసుకొని సీతారాముల‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై క‌త్తిపై ప‌లువురు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి క‌త్తి మ‌హేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసి స్టేష‌న్ కు త‌ర‌లించారు.

ఐపీసీ సెక్ష‌న్ 295(1)..505(2).. కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు క‌త్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఫోన్ ఇన్ లో మాట్లాడిన క‌త్తి.. రాముడి మీదా.. సీత మీదా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ప‌లువురు మండిప‌డ్డారు. క‌త్తి వ్యాఖ్య‌ల‌పై విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క‌ర్త కిర‌ణ్ నంద‌న్ ఇచ్చిన కంప్లైంట్ తో కేసును న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా.. క‌త్తి వ్యాఖ్య‌ల్ని ప్ర‌సారం చేసిన ఛాన‌ల్ ఎదుట బీజేపీ.. భ‌జ‌రంగ్ ద‌ళ్‌.. వీహెచ్‌పీ నేత‌లు ప‌లువురు ఆందోళ‌న చేప‌ట్టారు. మ‌రోవైపు హిందువుల మ‌నోభావాల్ని కించ‌ప‌రిచేలా మాట్లాడిన క‌త్తిని అరెస్ట్ చేయాలంటూ శ్రీ పీఠం వ్య‌వ‌స్థాప‌కులు స్వామి ప‌రిపూర్ణానంద డిమాండ్ చేశారు. క‌త్తి మ‌హేశ్ అచ్చోసిన అంబోతులా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంటే తెలుగు ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌టం సిగ్గు చేట‌న్నారు.

క్రైస్త‌వుడైన క‌త్తి మ‌హేవ్ ఏ సంఘానికి ఏజెంటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్న‌ట్లుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌రిపూర్ణానంద స్వామి.. క‌త్తిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు . ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టిన స‌మ‌యానికి క‌త్తిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఇదిలా ఉండ‌గా.. రాములోరిపై క‌త్తి చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌.. ఏపీలోని ప‌లుచోట్ల కేసులు న‌మోదయ్యాయి.


Tags:    

Similar News