అంద‌రినీ క‌దిలిస్తున్న క‌త్తి రాముడు!

Update: 2018-07-05 04:38 GMT
మేధావుల‌న్న ట్యాగ్ పెట్టుకొని తిరిగే బ్యాచ్ ఒక‌టి ఉంటుంది. వారికి కొంద‌రు దేవుళ్లు తేర‌గా దొరుకుతారు. త‌మ నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌తారు. అదేమంటే.. లాజిక్కులు తీస్తారు?  వారి లాజ్కికులు ఎంత చౌక‌బారుగా ఉంటాయ‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే.. మొండిగా..మూర్ఖంగా వాదిస్తుంటారు. అలాంటి బ్యాచ్‌ కు చెందినోడు క‌త్తి మ‌హేశ్‌. రాముడు.. సీత‌.. రావ‌ణుడుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మంట పుట్టిస్తున్నాయి.

ఎప్పుడు దేవుళ్ల వ్య‌వ‌హారం మీద మాట్లాడ‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి వారు సైతం నోరు విప్పుతున్నారు. ఇలాంటి ప‌ద్ధ‌తి ఏ మాత్రం స‌రికాదంటూ ఫైర్ అవుతున్నారు. భావోద్వేగాల్ని రెచ్చ‌గొట్ట‌టం.. అలా చేస్తారేం? అని అడిగితే.. ఇది క‌త్తి రామాయ‌ణం అనుకోండంటూ ఎట‌కారం చేయ‌టం చూస్తే.. వివాదాల‌తో మ‌రింత ప్ర‌ముఖుడిగా మారాల‌న్న ఆలోచ‌న క‌త్తిలో ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. నిత్యం పలు ర‌కాల పొల్యూష‌న్ల గురించి మాట్లాడే  ఇద్ద‌రు చంద్రుళ్లు.. ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో పొల్యూష‌న్ ను అదే ప‌నిగా వ‌దులుతున్న క‌త్తిలాంటి వారి మీద చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌టం లేద‌న్న‌ది అర్థం కానిది. ఉద్య‌మ నేత‌ల్ని.. వివిధ అంశాల మీద పోరాడుతున్న నేత‌లకు త‌న విధానాల‌తో చుక్క‌లు చూపించే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. క‌త్తి లాంటి వారి మీద ఎందుకు దృష్టి సారించ‌టం లేద‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.

అన‌వ‌స‌ర విష‌యాల మీద నోరు విప్పి.. కొత్త వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. భావ‌స్వేచ్ఛ పేరుతో నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇంత‌కాలం ప‌లు విష‌యాల మీద ఇదే రీతిలో నోరు పారేసుకున్న క‌త్తి మ‌హేశ్ లాంటి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సింది. వ్య‌వ‌స్థ‌ల మీద ఎలాంటి అభిప్రాయం ఉన్న‌ప్ప‌టికీ.. తానేం మాట్లాడినా న‌డిచిపోతుంద‌న్న చుల‌క‌న‌భావం ఉండ‌కూడ‌దు. రాముడిపై అనుచిత వ్యాఖ్య‌ల‌కు ముందు క‌త్తి మ‌హేశ్ మాట్లాడే మాట‌లకు మ‌ద్ద‌తు ఇచ్చే వారున్న‌ట్లే.. వ్య‌తిరేకించే వారూ ఉండేవారు.

తాజా ఎపిసోడ్ మాత్రం అందుకు భిన్నంగా.. మ‌ద్ద‌తు ఇచ్చే వారి కంటే ఫైర్ అయ్యే వారే ఎక్కువ అవుతున్నారు. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఆట‌లాడుకోవాల‌నుకునే వారికి చ‌ట్టం చెక్ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుంటే.. అన‌వ‌స‌ర‌మైన భావోద్వేగాలు కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News