జ‌న‌సేన‌లో ర‌చ్చకు తెర‌..క‌త్తి మార్క్ పంచ్ ట్విస్ట్‌

Update: 2018-04-02 08:04 GMT

పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదిలోనే అనూహ్య ప‌రిణామాలు ఎదురైన సంగ‌తి తెలిసిందే. పార్టీ ముఖ్య‌నేత‌గా ఉన్న క‌ళ్యాణ్ దిలీప్ సుంక‌రకు ఆ పార్టీలో కొన్ని చేదు అనుభ‌వాలు ఎదుర‌వ‌డం ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించ‌డం, ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్  మీడియాలో ప్ర‌క‌టించ‌డం...జ‌న‌సేన పార్టీ వ‌ర్గాల్లో కూడా ఈ ప‌రిణామం ఆందోళ‌న క‌లిగించ‌డం తెలిసిన సంగ‌తే. అయితే ప‌వ‌న్ స్వ‌యంగా ఈ ఎపిసోడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. అయితే ఈ ప‌రిణామంపై సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ సెటైర్‌ వేశారు.

ఈ మేర‌కు త‌న ఫేస్‌ బుక్ అకౌంట్లో ఆయ‌న వివ‌రాలు పోస్ట్ చేశారు. `అధినేతను కలవలడం జరిగింది. సుదీర్ఘమైన సమయం కేటాయించారు. ఇదో అద్భుతమైన అనుభూతి..41 రోజులు ధ్యానం చేయ‌మ‌న‌డంతో పాటు కొన్ని సూచనలు ఆయన చేశారు. సోషల్ మీడియా ఈ మండలం రోజులు పూర్తిగా తీసేస్తున్నా..` అని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్‌ తో త‌న భేటీ గురించి ప్ర‌వీణ్ వివ‌రాలు వెల్ల‌డిస్తూ..`వ్యవస్థతో పోరాడే శక్తి కలవాడివి..నీ స్థాయి ఏంటో తెలియని వ్యక్తులతో ఎంత కాలం పోరాడతావ్?" సోషల్ మీడియా విమర్శలకు స్పందించడం మానెయ్యగలిగే నియంత్రణ సాధించు.

నన్ను ఎంతో మంది ఎన్నో అంటారు.. వాటిన్నటికి స్పందిస్తే గమ్యం చేరుకోగలనా?` అంటూ పార్టీ ఆఫీస్ లో ఇద్దరు ప్రముఖల సమక్షంలో ఈ వ్యాఖ్యలు ప‌వ‌న్ చేశార‌ని క‌ళ్యాణ్ వెల్ల‌డించారు.

అయితే ఈ పరిణామంపై క‌త్తి మ‌హేశ్ త‌న‌దైన శైలిలో సెటైర్ వేశారు. `బావా! నువ్వు ఊరికే ఆడిపోసుకుంటావు గానీ. చూడు పవన్ కళ్యాణ్ - దిలీప్ సుంకరని కలిశాడంట. దేదీప్యమానంగా వెలుగుతూ దర్శనం ఇచ్చాడట. గురోపదేశం చేశాడంట.41 రోజుల దీక్ష పాటించమన్నాడట.`` ఒరే బామ్మర్ది. అదంతా వింటుంటే రాజకీయంలా ఉందా - దొంగస్వామీజీ లీలలాగా ఉందా? ఆలోచించు.`` అంటూ పంచ్ వేశారు.
Tags:    

Similar News