టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్... ఇప్పుడప్పుడే తన నోటికి తాళం వేసేలా కనిపించడం లేదు. సినీ క్రిటిక్ గానే ఎంట్రీ ఇచ్చిన మహేశ్... ఆ తర్వాత రాజకీయాలపై - సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరి బుర్రలకు పని పెట్టేస్తున్నారనే చెప్పాలి. టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని గతంలో కత్తి మహేశ్ వరుసగా చేసిన విమర్శలు పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. కత్తి మహేశ్ ఎంతగా తనను విమర్శిస్తున్నా... నోరు మెదిపేందుకు కూడా జంకిన పవన్ కల్యాణ్ చాలా సైలెంట్ గానే ఉండిపోయారు. అయితే పవన్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా కొందరు రంగప్రవేశం చేసి పరిస్థితిని మరింత దిగజార్చేశారనే చెప్పాలి. ఈ క్రమంలో కత్తి మహేశ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలు - దూషణలు బూతులూ దొర్లాయి. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. అయితే ఎలా సంధి కుదిరిందో తెలియదు గానీ... పవన్ ఫ్యాన్స్, కత్తి మహేశ్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని పోలీస్ కంప్లైంట్లను వెనక్కు తీసేసుకున్నారు.
ఆ తర్వాత ఓ నెల పాటు కత్తి మహేశ్ సైలెంట్ గానే ఉండిపోయారు. వేరే అంశాలపై యాక్టివ్ గానే ఉన్న కత్తి మహేశ్... పవన్ పై మాత్రం నోరు మెదపలేదనే చెప్పాలి. అయితే మొన్న గుంటూరు జిల్లాలో నిర్వహించిన జనసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలతో కత్తి మహేశ్ మళ్లీ ఆయనను టార్గెట్ చేశారు. ఉన్నట్టుండి తన పంథాను మార్చేసిన పవన్ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరుగా స్పందించిన మహేశ్... అసలు పవన్ మైండ్ సెట్ ఎప్పుడెలా ఉంటుందో చెప్పడం కష్టమేనంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. తాజాగా కాసేపటి క్రితం పవన్ మెంటాలిటీపై తనదైన మార్కు ట్వీట్లతో విరుచుకుపడిన కత్తి మహేశ్... పవన్ వైఖరిని నిజంగానే తూర్పారబట్టేశారన్న వాదన వినిపిస్తోంది. ఓ పల్లెటూరికి చెందిన బావా, బామ్మర్ది మధ్య జరిగిన సంభాషణతో ట్వీట్ల వర్షాన్ని కురిపించిన మహేశ్... ఆ ట్వీట్లలో పవన్ పై చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పాలి.
లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణను ప్రస్తావిస్తూ... దేనినైనా స్టార్ట్ చేసేదాకే పవన్ దానిపై శ్రద్ధ పెడతారని, ఆ తర్వాత దానిని పట్టించుకోరని, మొత్తంగా ఆయా అంశాలను పినిష్ చేసే సత్తా పవన్ కు లేదని మహేశ్ తేల్చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించిన మహేశ్... పవన్ కంటే చిరునే బెటరంటూ తీర్పిచ్చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ భావజాలంతో పార్టీ పెట్టానని పవన్ చేసిన ప్రకటనను ప్రస్తావించిన మహేశ్... సమాజంలో కాస్తంత ఉన్నతంగానే ఉన్న కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి, దిగువన ఉన్న దళితులకు రిజర్వేషన్లు ఎత్తేస్తారేమో?నన్న కోణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తి సంధించిన మూడు ట్వీట్లు ఎలా సాగాయన్న విషయానికి వస్తే...
1. *బావా! జేపీ గారు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ జేఎఫ్ సి మీద శ్రద్ధ చూపడం లేదని అంటాడేమిటి?" ‘‘బామ్మర్ది... పవన్ కళ్యాణ్ కి దేని మీదా పర్మనెంటుగా శ్రద్ధ ఉండదని - స్టార్ట్ చేసింది - ఫినిష్ చేసే సత్తా అస్సలు ఉండదని - అనుభవమైతేగాని ఆయనకు తెలిసిరాలేదు. అంతే*
2. *ఒక ఊరిలో ఒక వెధవ.బ్రతికుండగా,ఆడోళ్ళని నానా హింసాలూ పెట్టేవాడు.చచ్చేముందు కొడుకుతో,బ్రతకడం ఇట్టా బతికేసాను.చచ్చాకైనా నాకు మంచిపేరు తీసుకురా అన్నాడట. కొడుకు తండ్రికన్నా దారుణాలు చేసి, వీడికన్నా వీడి తండ్రే బెటర్ అనిపించాడంట. ఇప్పుడు చిరంజీవిని చూస్తే, బెటర్ అనిపించదూ మరీ!!!*
3. *బావా! జనసేన అంబేద్కర్ భావజాలంతో ఏర్పడింది అని వాళ్ళ కొత్త నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ రావు అంటున్నారు. ఇదేదో కొత్తగా లేదూ! కొత్తగానే ఉంది బామ్మర్ది! అధికార కులమైన కాపులకు రిజర్వేషన్లు కావాలి. దళితులకు రిజర్వేషన్లు తీసేయాలి. అనేది ఏ తరహా అంబేద్కర్ సిద్దాంతామో నాకైతే తెలీదు*