బెజ‌వాడ‌లో క‌త్తి మ‌హేష్....!

Update: 2018-09-03 11:23 GMT
హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ను హైద‌రాబాద్ నుంచి 6 నెల‌ల పాటు బ‌హిష్క‌రించిన విష‌యం విదిత‌మే. ఆ త‌ర్వాత శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా తెలంగాణ ప్ర‌భుత్వం న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించ‌డం సంచ‌ల‌నం రేపింది. త‌న బ‌హిష్క‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ ప‌రిపూర్ణానంద కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆ కేసు విచార‌ణ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన క‌త్తి మ‌హేష్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై తాను విజ‌య‌వాడ‌లో మ‌కాం వేయ‌బోతున్న‌ట్లు మ‌హేష్ ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడలోని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో మీడియాతో మాట్లాడిన మ‌హేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య మ‌హేష్ పై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌హేష్ ను చిత్తూరుకు త‌ర‌లించారు. అప్ప‌టి నుంచి మ‌హేష్ మీడియా - సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌డం లేదు. ఆయ‌న కొంత‌కాలంగా బెంగుళూరులో ఉంటున్నారు. అయితే, ఇక‌పై విజ‌యవాడ‌లో మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించుకున్న మ‌హేష్ నేడు విజ‌య‌వాడ వ‌చ్చారు. తాను ఇక‌పై విజయవాడలో ఉండటానికి వ‌చ్చాన‌ని గన్నవరం విమానాశ్రయంలో విలేక‌రుల‌తో మహేష్ అన్నారు. తాను అంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తినేనని... తనపై హైదరాబాదు సిటీ నిషేధం మాత్రమే ఉందని తెలిపారు. హైదరాబాదులో త‌ప్ప వేరే రాష్ట్రంలో ఎక్కడైనా నివసించవచ్చని - కాబ‌ట్టి తాను ఇక‌పై విజయవాడలో ఉండేందుకు వచ్చానని తెలిపారు.
Tags:    

Similar News