వైజాగ్ ఎంపీ టికెట్ పై కౌశల్ క్లారిటీ

Update: 2019-03-14 11:10 GMT
బిగ్ బాస్ 2 విజేతగా నిలిచాక కౌశల్ మందాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఏకంగా ఆయన పేరిట ఆర్మీ ఏర్పడింది. ఫ్యాన్స్ కు ఆరాధ్యుడయ్యాడు. ఈ క్రేజ్ తో ఇటీవల మంత్రి గంటా, సీఎం చంద్రబాబును కలిశారు. కౌశల్ ను విశాఖ ఎంపీగా టీడీపీ నిలబెడుతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా జనసేన తరుఫున విశాఖ ఎంపీ టికెట్ పై పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి.

తాను ఎంపీగా నిలబడుతున్నాననే వార్తల నేపథ్యంలో తాజాగా కౌశల్ అధికారికంగా స్పందించాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని.. కానీ తాను ఏ పార్టీ తరుఫున ప్రచారం చేయనని.. ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉంటానని తెలిపారు.

కౌశల్ మాట్లాడుతూ.. ‘నాకు ప్రస్తుతానికి రాజకీయాలపై ఆసక్తి లేదు. ఒకవేళ తాను రాజకీయాల్లోకే వెళ్లాలనుకుంటే బిగ్ బాస్ లో విజేతగా నిలవగానే వెల్లేవాడిని. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం. నాకు ఆయన నటన అన్నా.. ఆయన వైఖరి అన్నా చాలా ఇష్టం. అదే సమయంలో చంద్రబాబు గారి లాంటి ఇంటెలిజెంట్ లీడర్ నా గుండెల్లో చెరగని ముద్రవేశారు. రాజకీయ నాయకుల్లో నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారంటే ఇష్టం. నా వ్యక్తిగత ఇష్టాలు నాకున్నాయి. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. న్యూట్రల్ గా ఉన్నాను’ అంటూ కౌశల్ స్పష్టం చేశారు.

ఇలా రాజకీయాల్లో చేరి ఎంపీగా పోటీచేస్తాడనే ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఏపార్టీలో చేరడం లేదని.. పోటీచేయడం లేదని కౌశల్ క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్ లో కౌశల్ ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే..
Tags:    

Similar News