తెలంగాణలో కారు జోరుకు అసమ్మతులు బ్రేకులు వేస్తున్నాయి! టీఆర్ ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే పోటీలో ఉంటామని కరాఖండిగా నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుంటున్నారు. కొంతమంది అసంతృప్తుల్ని అధిష్టానం పిలిచి మాట్లాడుతున్నప్పటికీ పోటీలో ఉంటామన్ని కొన్నిచోట్ల రెబల్స్ ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇందులో తొలి వ్యక్తి బహిరంగంగా ప్రకటనలు చేయడం గమనార్హం. పైగా కేసీఆర్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం. ఆయనే కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యె కావేటి సమ్మయ్య. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సమ్మయ్య హాట్ కామెంట్ చేశారు.
వందల కేసులు ఉన్న తెలంగాణ ఉద్యమకారుడైన తనను కాదని ఆంద్ర వలసవాదికి టిక్కెట్ ఇవ్వడం నిజంగా చాలా దారుణమని సమ్మయ్య వాపోయారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పెద్దలపై ఆయన మండిపడ్డారు. ``తెలంగాణ ఉద్యమంలో నాపై వందల కేసులు నమోదైన సంగతి మీకు తెలియంది కాదు. నాపై అబద్దాలు మాయ మాటలు చెప్పి మీకు దగ్గరైన వారికి టికెట్ ఇస్తారా? లక్ష ఓట్లకు పైగా ఉన్న బీసీలను కాదని కేవలం 500 ఓట్లు ఉన్న అగ్రకులానికి అందులోనూ ఆంధ్రా మూలాలున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా దారుణం`` అంటూ అసహనం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపొయిన తాను కేసీఆర్ మాటే శీరోదార్యంగా బావించానని అయినా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ``సిర్పూర్ లో మొదట టీఆర్ ఎస్ జెండా పట్టి పల్లెపల్లెలో తిరిగినపుడు నన్ను - కేసిఆర్ ను పిట్టల దొరగా చెప్పిన ఆంద్రవాదికి ఈ రొజు మీరు టికెట్టు ఇవ్వడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు విమర్శలే ప్రతిపదికా? అలా అయితే త్వరలో ప్రజల మద్దతుతో - ఆశీర్వాదంతో రెబల్ గా బరిలో ఉంటాను`` అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు.