టీఆర్ ఎస్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న బీజేపీకి ఓటు వేస్తానని చెప్పారు. అదికూడా బాహాటంగా ప్రకటించారు. అదేంటి..తండ్రి అడుగు జాడల్లో నడిచే కవిత ఈ విధంగా ప్రకటన చేశారా...నిజమా? అంటే అవును నిజమే. అదికూడా అధికారికంగా ప్రకటించారు మరి.
ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు పట్టం కట్టాలని కవిత కోరారు. గ్రేటర్ లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 150 కార్పొరేట్ సీట్లలో 75 సీట్లను మహిళలకు కేటాయించిన ఘనత టీఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో ఇప్పటికీ 4 వందల ఏళ్ల కిందట నిజాం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థనే వాడుతున్నారని గత పాలకులు హైదరాబాద్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ కు ఇన్ని ఇళ్లు ఇచ్చాం...అన్ని ఇళ్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెప్పుకోవడంపై ఎంపీ కవిత మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి వాటిని మంజూరు చేయించుకున్నామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పోట్లాడి వాటిని తీసుకొచ్చామని చెప్పారు. ఇన్ని చేశామని చెప్తున్న బీజేపీ నాయకులు హైదరాబాద్ కు 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకువస్తే తాను కూడా బీజేపీకే ఓటు వేస్తానని ప్రకటించారు. ఈమేరకు కేంద్రమంత్రి దత్తాత్రేయ - బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు బాధ్యత తీసుకుంటారా అంటూ కవిత సవాల్ విసిరారు.