గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెడ్డం పెంచడంపై తాజాగా క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. పెరిగిన గడ్డంతో జనం ముందుకు రావడం వెనక ఉత్తమ్ హెల్త్ రీజన్ వుందని మొదట్లో వినిపించినా... అది అసలు కారణం కాదని దానివెనుక పెద్ద శపథమే వుందని... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు ఉత్తమ్ కుమార్ గడ్డం తీయరని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ శపథంలో వాస్తవం ఎంతుందో ఇంకా తెలియదు కానీ... ఈ విషయంపై కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి.
ఈ విషయంపై స్పందించిన తెరాస ఎంపీ కవిత.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక నెరవేరకపోవచ్చని అన్నారు. ఆ కోరిక పెట్టుకుంటే ఆయన గడ్డానికి బదులు జడలు పెంచుకోవాల్సి వస్తుందని సెటైర్ వేశారు. నిజాం షుగర్స్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, ఇప్పటి వరకు రూ.50కోట్లు చెల్లింపులు చేసిన ఘనత టీఆర్ ఎస్ పార్టీదేనని కవిత చెప్పారు. ఇదే క్రమంలో వరదలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.
టీఆర్ ఎస్ పార్టీ తప్పుడు సర్వేలు చేయించిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అత్యధిక స్థానాలు తమకే వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ కవిత ఈ కౌంటర్ ఇవ్వగా, ఆయన గడ్డం శపథంపై కూడా సెటైర్స్ పడిపోయాయి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/