నోటీసులుజారీ చేయటంతో పాటు.. అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె క్రికెట్ అసోసియేషన్ మీద దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఆమె చాలా పెద్ద వ్యూహంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో తిరుగులేని అధికారంలో ఉన్న వేళ..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనకు తానుగా ఉండటం.. దానిపై తమకు ఎలాంటి పట్టు లేకపోవటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే ఐపీఎల్ టోర్నీ ను హైదరాబాద్ లో నిర్వహిస్తే.. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చూసుకుంటుందని తన సోదరుడు కమ్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి వెల్ కం చెప్పినప్పటికీ బీసీసీఐ ఏ మాత్రం విలువ ఇవ్వకపోవటం ఆమెను బాధించినట్లు చెబుతున్నారు.
బీసీసీఐలో తమకు పట్టు లేకపోవటమే హైదరాబాద్ నగరానికిశాపంగా మారినట్లుగా భావిస్తున్న ఆమె.. క్రికెట్ మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పట్టు సాధించటం ద్వారా.. తర్వాతి టార్గెట్ బీసీసీఐ మీదనేనన్న మాట వినిపిస్తోంది. తాజాగా హెచ్ సీఏలో నెలకొన్న లొల్లి మొత్తం టీజర్ మాత్రమేనని.. అసలు సినిమా వేరుగా ఉందంటున్నారు. ఇప్పటికే హెచ్ సీఏలోని కొందరితో ఎమ్మెల్సీ కవిత మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. లోధా సిఫార్సుల నేపథ్యంలో చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వారు బీసీసీఐ.. అనుబంధ సంఘాల్లో పోటీ చేయటానికి అనర్హులుగా తేలటంతో.. కవితకు అవకాశం లేదంటున్నారు. అందుకే.. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండటంతో పాటు విధేయులుగా ఉండే వారిని హెచ్ సీఏలోకి ఎంట్రీ ఇప్పించాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హెచ్ సీఏలో పట్టు పెంచుకున్నాక తర్వాతి లక్ష్యం బీసీసీఐగా చెబుతున్నారు. మరి.. ఈ ప్లాన్ ఎంతవరకు నిజమన్నది కాలమే చెప్పాల్సి ఉందంటున్నారు.