పేరుకే కేసీఆర్‌.. తెలుగు లెక్క ఖాతా ఆమెదే!

Update: 2017-12-13 04:32 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ రాజ‌కీయ లెక్క‌లు మ‌హా చిత్రంగా ఉంటాయి. ఒకే కుటుంబంలో ఒక ముఖ్య‌మంత్రి.. ఒక మంత్రి.. ఒక ఎంపీ ఉన్న వేళ‌.. వీరి మ‌ధ్య స‌మ‌న్వ‌యం మా చ‌క్క‌గా ఉంటుందంటారు. ఇక‌.. ముఖ్య‌మంత్రి మేన‌ల్లుడు సైతం మ‌రో మంత్రి కావ‌టంతో.. కుటుంబానికి మేన‌ల్లుడికి మ‌ధ్య విభ‌జ‌న రేఖ చాలా స్ప‌ష్టంగా ఉంటుంద‌ని చెబుతారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వ‌హించే పెద్ద‌.. పెద్ద కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి.. ఒక్కోకార్య‌క్ర‌మానికి ఒక్కొక్క‌రు బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని చెబుతున్నారు. తాజాగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల వ్య‌వ‌హార‌మే తీసుకోండి. చూసేందుకు మొత్తం సీఎం కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంటుంది. కానీ.. ఇది నిజం కాదు. మ‌రి.. తెర‌వెనుక జ‌రుగుతుంద‌న్న‌ది వేరే ముచ్చ‌ట అని చెబుతుంటారు.

ప్ర‌పంచ తెలుగు మహా స‌భ‌ల‌కు సంబంధించి బొమ్మ కేసీఆర్ దే అయిన‌ప్ప‌టికీ.. తెలుగు బండిని న‌డిపిస్తున్న‌దంతా సీఎం కుమార్తె క‌మ్‌ ఎంపీ కవిత‌గా చెబుతున్నారు. ఇటీవ‌ల ముగిసిన జీఈఎస్‌.. మెట్రో రైలు ప్రారంభంలో త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టిన మంత్రి కేటీఆర్‌.. తెలుగు ప్రోగ్రాంకు సంబంధించి ఒక్క‌టి కూడా ట‌చ్ చేయ‌లేద‌ని చెబుతారు.

జీఈఎస్‌.. మెట్రోతో తాను సాధించిన మైలేజీపై కేటీఆర్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కవిత వంతు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.  

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సంబంధించి బోలెడ‌న్ని కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నా.. వాటిల్లో ఎక్క‌డా క‌విత ప్ర‌ముఖంగా క‌నిపించ‌ర‌ని.. కానీ తెర వెనుక అంతా క‌విత చెప్పిన‌ట్లే జ‌రుగుతుందన్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు కూడా. ఇప్ప‌టికే త‌మ‌కున్న అనుకూల మీడియాతో తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సంబంధించి తెలంగాణ స‌ర్కారు అద‌ర‌గొట్టేస్తుద‌న్న భావ‌న‌ను ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిష్ట‌ర్ అయ్యేలా వ్యూహం సిద్ధ‌మైంద‌ని చెబుతున్నారు.మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. పేరు ప్ర‌ఖ్యాతుల్ని పంచుకునే విష‌యంలో కేసీఆర్ ఫ్యామిలీ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న మాట తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News