రాజ్యసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారీ మార్పులు చోటు చేసుకోను న్నాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ ను పున ర్వ్య వస్థీకరణ చేయనున్నారా? కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో తెరాస చేరనున్నదా? ఇటీవల అనేక రాజకీయ పరిణమాలు ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నా యి. ఢిల్లిలో ఇటీవల మోడీ - కేసీఆర్ భేటీ... తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాని ప్రశంసలు వంటివన్నీ రెండు పార్టీల మైత్రి దిశగా అడుగులు పడుతోందన్న సంకేతాలిస్తోంది.
నాలుగు రోజులు కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లికి వెళ్లి ప్రధాని మోడీతో సమావేశమైన సందర్భంలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు వివరించి సాయం కోరడంతో పాటు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా టీఆర్ ఎస్ - బీజేపీల చెలిమి ప్రత్యేక చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లో టీఆర్ ఎస్ పార్టీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా ప్రధాని కార్యాలయ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ట్వీట్లు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను ప్రధాని కార్యాలయం మెచ్చుకుంది. ప్రత్యేకించి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోడి మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలను మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని ట్విట్టర్ లో పేర్కొనడం చూస్తుంటే భవిష్య త్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ - టీఆర్ ఎస్ కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ సాగుతోంది.
ఢిల్లీలో కూడా టీఆరెస్ - బీజేపీల చెలిమిపై బలంగానే ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ లో టీఆర్ ఎస్ చేరడం ఖాయమని ఢిల్లిలోనూ వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి రెండు సంవత్సరాల అధికారాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలో (రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక) జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం లభిస్తుందని, ఈ మేరకు అంగీకారం కుదిరిందని టీఆర్ ఎస్ పార్టీ నేతలు కొందరు అంటున్నారు. కేంద్రంలో టీఆర్ ఎస్ చేరితే రాష్ట్రానికి వచ్చే రెండు మంత్రి పదవుల్లో ఒకటి నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు - సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఖాయమైందని సమాచారం. రెండో పదవి కోసం మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి - ఇటీవలనే వైసీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య పోటీ నెలకొందని తెలుస్తోంది. కాగా పొంగులేటికి రెండో మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటుంటున్నట్లుగా తెలుస్తోంది.. అయితే.. బీజేపీలో తనకున్న పూర్వపు పరిచయాలను కొనసాగించి మంత్రివర్గంలో చోటుకోసం మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని... బీజేపీ వైపు నుంచి ఆయన పేరు ప్రతిపాదనలోకి వచ్చేలా చూసుకుంటున్నారని టాక్.