అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని విషయాల్లో కాకున్నా..కొన్ని విషయాల్లో మాత్రం ఆయన చెప్పే మాటలకు చేసే పనికి ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరిస్తుంటారు.
ఉన్నట్లుండి మీడియా ముందుకు రావటం.. సంచలన ప్రకటనలు చేయటం.. నేను సీన్లోకి దిగుతున్నా..రచ్చ..రచ్చే అన్నట్లుగా మాటలు చెప్పటం.. ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు రావటానికే వారాల తరబడి సమయాన్ని తీసుకోవటం లాంటివెన్నోకనిపిస్తాయి.
కేంద్రం మీద పోరుకు సై అంటూ గర్జించిన కేసీఆర్.. ఆ తర్వాత అందుకు సంబంధించిన ఎలాంటి పరిణామం చోటు చేసుకోవటంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం కనిపిస్తుంది. ఇంతకూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న దానిపై కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మిగిలింది. ఇలాంటివేళ.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికే పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
తాజాగా కేసీఆర్ రెండు రోజుల తమిళనాడు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటన ప్రత్యేకత ఏమంటే.. కేసీఆర్ తానొక్కడినే కాకుండా.. సకుటుంబ సమేతంగా ఆయన తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. దీన్ని అధికారిక కార్యక్రమంగా చూడలేం. ఎందుకంటే.. తాజా పర్యటనలో ఆయన ఫోకస్ అంతా తమిళనాడులోని ఆలయాల్ని దర్శించటమేనని చెబుతున్నారు.
శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మరికొన్ని దేవాలయాల్ని సందర్శిస్తారు. ఆపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో తమిళనాదులోని తిరుచిరాపల్లికి వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం చెన్నైకి చేరుకొని అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అవుతారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే.. కేసీఆర్ తాజా తమిళనాడు పర్యటన గుళ్ల సందర్శన పేరుతో సాగనున్న రాజకీయ పర్యటనగా పలువురు అభివర్ణిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలని బలంగా అనుకుంటున్న ఆయన.. బీజేపీ.. కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు ఇలాంటి జట్టు కట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజా తమిళనాడు ర్యటనతో కేసీఆర్ సైతం మూడో ఫ్రంట్ కోసం కసరత్తు మొదలుపెట్టినట్లుగా చెప్పాలి.
ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై తీవ్రంగా తప్పు పడుతున్న కేసీఆర్.. మోడీ సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రం తీరును ఆయన ఇప్పటికే పెద్ద ఎత్తున ఎండగట్టారు. మూడో ఫ్రంట్ ను తెర మీదకు తెచ్చేందుకు ఉన్న అవకాశాల్ని ఆయన వెతుకుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక జట్టుగా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతారు.
వాస్తవానికి గత లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా తమిళనాడుకు వెళ్లిన ఆయన.. 2010 మేలో అప్పటి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ అయ్యారు. తాజా పర్యటన సందర్భంగా వచ్చే ఏడాదిలో జరిగే యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సైతం స్టాలిన్ ను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.
లోక్ సభలో తమిళనాడురాష్టానికి 39 స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటులో తమిళనాడుకీలక భూమిక పోషిస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థతుల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేకు మించిన ప్రత్యామ్నాయ పార్టీ లేదనే చెప్పాలి. తక్కువలో తక్కువ వేసుకున్నా 2024లో జరిగే ఎన్నికల్లో మొత్తం 39 స్థానాల్లో 36 నుంచి 38 స్థానాల వరకు డీఎంకే సొంతం అయ్యే అవకాశం ఉంది.
ఈ కారణంగానే మూడో ఫ్రంట్ మీద స్టాలిన్ ఆలోచనలు ఏ రీతిలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటంతో పాటు.. స్టాలిన్ తో జట్టు కట్టేందుకు అవకాశం ఏ మేరకు ఉందన్న దానిపై అవగాహనలో భాగంగా కేసీఆర్ తాజా పర్యటన ఉందంటున్నారు. పేరుకు ఆధ్యాత్మిక పర్యటనగా చెప్పినప్పటికి.. అంతర్లీనంగా మాత్రం.. ఈ టూర్ కు రాజకీయ ప్రాధాన్యత ఉందని చెప్పక తప్పదు.