వ్యూహ-ప్ర‌తివ్యూహాల్లో..కేసీఆర్ త‌ల‌మున‌క‌లు.. రీజనేంటి?

Update: 2023-02-26 12:16 GMT
అదేంటి అనుకుంటున్నారా?  బీఆర్ ఎస్ ఏంటి?  టీఆర్ ఎస్ కావ‌డం ఏంటి? అని ఆశ్చ‌ర్య పోతున్నారా?  ఇక్క‌డే ఉంది.. అస‌లు విష‌యం. ఇంకేముంది.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతాను.. కేంద్రంలో మోడీని దింపే స్తాన‌ని నిన్న మొన్న‌టివ‌ర‌కు చెప్పిన సీఎం కేసీఆర్‌.. వ‌చ్చే నాలుగు మాసాల వ‌ర‌కు కూడా.. కేంద్రం ఊసే లేకుండా.. పోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. రాష్ట్రంలో రాజ‌కీయం భారీ స్థాయిలో వేడెక్క‌డ‌మే!

రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి కూడా రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు ముమ్మ‌రం చేశారు. పాద‌యాత్ర‌ల వేడి పెరిగింది. నాయకుల స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు కూడా రోజుకోర‌కంగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముం దు రాష్ట్రంలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకునేందుకు బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఈ క్ర‌మంలోనే కేంద్ర రాజ‌కీయాల‌పై ఆయ‌న ప్ర‌స్తుతానికి దృష్టి త‌గ్గించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో  ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్నా రు. అంతేకాదు.. గెలిచేనాయ‌కులు ఎవ‌రు?  నిలిచే నాయ‌కులు ఎవ‌రు? అనే విష‌యాన్ని కూడా కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇంట్లోనే.. అన్ని వివ‌రాలు సేక‌రించి..చ‌ర్చిస్తున్నార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం వ‌చ్చే రెండు మూడు మాసాల వ‌ర‌కు కూడా కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల జోలికి పోర‌ని... కీలక నాయ‌కులే చెబుతున్నారు.

ప్ర‌ధానంగా మూడో సారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవ‌డం..హ్యాట్రిక్ కొట్టిన త‌ర్వాత కేంద్రంపై దృష్టి పెట్ట డం అనే కాన్సెప్టుతో కేసీఆర్ ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే..కొన్నాళ్ల పాటు కేంద్ర రాజ‌కీయాల‌పై మౌనంగా ఉండి.. పూర్తిస్థాయిలో రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన త‌ర్వాత‌.. కేంద్రంపై విజృంభించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Similar News