మనిషి అన్నాక లోపాలు ఉండక మానదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు మినహాయింపు కాదు. ఆయనలో లోపాలు ఉన్నట్లే.. గుర్తించాల్సినవి.. నేర్చుకోవాల్సినవి.. ఫాలో కావాల్సిన అంశాలెన్నో ఉంటాయి. చాలామంది ముఖ్యమంత్రులతో పోలిస్తే.. కేసీఆర్ ది కాస్త భిన్నమైన మైండ్ సెట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే.. దేశ వ్యాప్తంగా జరిగే పలు అంశాల్ని చాలా సునిశితంగా పరిశీలిస్తుంటారు. చిన్న చిన్న విషయాల్ని సైతం ఆయన లోతుల్లోకి వెళతారు. గత నెలలో దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి.. పంజాబ్ లోని సింగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన అంశాన్ని తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కీలక పరిణామాన్ని లైట్ తీసుకుంది.
అలాంటి అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకోవటమే కాదు.. దాని లోతుల్లోకి వెళ్లి.. అసలేం జరిగింది? అన్న గ్రౌండ్ రిపోర్టు కోసం ఆయన ఆరా తీస్తున్న వైనం చూసినప్పుడు.. దేశ వ్యాప్తంగా చోటు చేసుకునే ప్రతి చిన్న రాజకీయ పరిణామాన్ని ఆయన ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. అధినేతలు ఎంతటి పని ఒత్తిడి.. మరెన్ని అంశాల్లో బిజీగా ఉంటారో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లోనూ సదూరాన ఉన్న పంజాబ్ లో జరిగిన ఉప ఎన్నిక మీద కేసీఆర్ అంత ఇంట్రస్టు చూపించటానికి కారణం ఏమిటి? అక్కడేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఈ మధ్య జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించటం తెలిసిందే. వ్యవసాయ చట్టాల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పంజాబీలు బీజేపీని దారుణంగా ఓడిస్తే.. అధికార కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంత్రప్తితో ఉన్న వారు దాన్ని పట్టించుకోకుండా.. ప్రత్యామ్నాయంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు. అధికారాన్ని అరచేతిలో పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే విషయంపై అవగాహన ఉన్నప్పటికీ.. మరీ ఇంత ఘన విజయాన్ని అందుకుంటారన్న అంచనాలు అయితే రాలేదనే చెప్పాలి.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవంత్ సింగ్ మాన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. దీంతో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన రెండు దఫాలుగా ఎంపీగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న భగవంత్ కు సంగ్రూర్ నియోజకవర్గం కంచుకోటగా అభివర్ణిస్తారు. అందులోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. మంచి ఊపులో ఉన్న ఆప్ కు ఉప ఎన్నికల్లో ఫలితం సానుకూలంగా ఉంటుందని ఆశించారు.
అనూహ్యంగా.. అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దారుణ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి భగవంత్ కు షాకిస్తూ సంగ్రూర్ నియోజకవర్గ ఓటర్లు తమ తీర్పును ఇచ్చారు. రాడికల్ సిక్కు గ్రూప్ శిరోమణి అకాలీ దళ్ (అమృతసర్) అధినేత సిమ్రజిత్ సింగ్ మాన్ అనూహ్య విజయాన్ని సాధించారు. 5822 ఓట్ల మెజార్టీతో గెలిచినప్పటికి.. ఇదో సంచలనంగా మారిన పరిస్థితి. మెజార్టీ స్వల్పమే అయినా ఫలితం మాత్రం పెద్దదని చెప్పాలి. అధికార ఆమ్ ఆద్మీపార్టీకి ఈ ఫలితం ఒక షాకింగ్ గా చెప్పాలి.
ఇక.. సిమ్రజిత్ సింగ్ మాన్ విషయానికి వస్తే.. 77 ఏళ్ల ఈ రిటైర్డు సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎంపీగా గెలవటం ద్వారా.. తన సత్తా చాటారని చెప్పాలి. మాన్ విషయానికి వస్తే 1989లోనూ 1999లోనూ ఆయన ఎంపీగా ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన విజయమే చేతికి చిక్కలేదు. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయన గెలుపు పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారింది.
ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చిందన్న విషయానికి వస్తే.. అతి తక్కువ పోలింగ్ కావటం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆప్ కొంపను ముంచాయి. దీనికి ముఖ్యమంత్రిగా భగవంత్ బాధ్యతల్ని తీసుకున్న తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందన్న ప్రచారం జోరందుకోవటం కూడా కారణం. దీనికి తోడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం వేళ.. పంజాబ్ లోని చాలా ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నరాడికల్ సంస్థలు బలోపేతం కావటంతో పాటు.. తమ ఉనికిని చాటుకోవలన్న తపన తోడైనట్లు చెబుతారు. ఇదే.. మాన్ కు ఘన విజయాన్ని తెచ్చి పెట్టినట్లుగా చెప్పొచ్చు. పంజాబ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే భావోద్వేగ అంశాలు మాన్ గెలుపునకు తోడ్పాటునిచ్చాయి.
మాన్ విషయానికి వస్తే.. పక్కా సిక్కు నాయకుడిగా చెప్పాలి. ఉన్నత విద్యావంతుడు.. దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసు అధికారిగా వ్యవహరించినప్పటికి.. ఆయన ధోరణి మాత్రం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఇదే ఆయన్ను ఆపరేషన్ బ్లూ స్టార్ కు వ్యతిరేకంగా తన ఐపీఎస్ కు రాజీనామా చేసేలా చేసింది. తన రాజీనామా లేఖలోనూ ఆయన ఆపరేషన్ బ్లూ స్టార్ ను ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. బ్రిటీష్ పాలకులతో పోల్చి చూసిన వైనం చూస్తే.. ఆయన భావాలు ఎలా ఉంటాయో అర్థమయ్యేలా చేస్తుంది. ఇదే ఆయన్ను తర్వాతి కాలంలో రాజ్యానికి వ్యతిరేకంగా కార్యకలాపలు చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ ఆయన్ను జైల్లో పెట్టారు. అంతేకాదు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఉదంతంలోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దాదాపు ఐదేళ్లు జైల్లో గడిపిన ఆయన.. 1989లో బయటకు వచ్చారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం వంద మంది సిక్కు ఖైదీల్ని ఎలాంటి షరతులు లేని రీతిలో విడుదల చేయటం.. ఆ సందర్భంగా వారిపై ఉంచిన కేసుల్ని ఎత్తేయటం జరిగింది. ఇలా జీవితంలో ఎత్తుపల్లాల్ని చూసిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత.. 77 ఏళ్ల వయసులో ఆయన సాధించిన విజయం.. హాట్ టాపిక్ గా మారింది. ఇదే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకర్షించేలా చేయటమే కాదు.. ఆయన గెలుపు ఎలా సాధ్యమైందన్న దానిపై సీరియస్ గా చర్చలు జరపటం ద్వారా.. తన తదుపరి వ్యూహాలకు పదును పెట్టారనే చెప్పాలి.