మళ్లీ మూడు రోజులు ఫాంహౌస్ లోనే కేసీఆర్

Update: 2016-06-04 06:30 GMT
అందరూ ఫాంహౌస్ అని చెప్పినా తనకు మాత్రం ఇల్లే అంటూ మొన్నామధ్య ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలంలోని ఎర్రవల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే ఆయన.. ఈ మధ్య కాలంలో తరచూ వెళుతున్నారు. మొన్నామధ్యన మూడు.. నాలుగు రోజుల పాటు ఉన్న కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముందు హైదరాబాద్ కు వచ్చారు. నాటి నుంచి బిజీ.. బిజీగా ఉన్న కేసీఆర్ గురువారం మంత్రివర్గపసమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం ఆయన సాయంత్రం ఆరు గంటల వేళ పాంహౌస్ (అదే ఆయన ఇల్లులాంటి)కి బయలుదేరి వెళ్లారు. దాదాపు మూడు రోజులు అక్కడే ఉండనున్నట్లు చెబుతున్నారు. తాను ఫాంహౌస్ లో ఉన్న పని చేస్తానని చెప్పిన కేసీఆర్.. పని సంగతేమో కానీ.. ఇలా తరచూ ఫాంహౌస్ కి వెళ్లటంపై మాత్రం పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంలో మూడు రోజులు చొప్పున రాజధానికి దూరంగా ఉండటం ఏమిటో కేసీఆర్ కే తెలియాలి. ఏమైనా.. అన్ని వసతులు ఉండి కూడా కార్యాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అవుతారేమో..?
Tags:    

Similar News