కేసీఆర్‌...నువ్వు సూప‌ర్

Update: 2015-11-12 15:49 GMT
తెలంగాణ ఉద్య‌మ‌కాలంలో అన్నివ‌ర్గాల‌ను క‌లుపుకొని పోరాటం స‌ల్పిన తెలంగాణ రాష్ర్ట స‌మితి అధినేత‌ - ప్ర‌స్తుత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇపుడు త‌నతో పాటు న‌డిచిన వ‌ర్గాల‌కు న్యాయం చేయ‌డంలో ముందడుగు వేస్తున్నారు. ఉద్య‌మంలో విద్యార్థులు - ఉద్యోగులు - యువ‌త‌ - జ‌ర్న‌లిస్టుల‌ది అత్యంత కీల‌క పాత్ర. విద్యార్థుల కోసం వ‌యోప‌రిమితి స‌డ‌లింపు క‌ల్పించిన సీఎం కేసీఆర్‌...నోటిఫికేష‌న్ విష‌యంలో కాస్త వేగం త‌గ్గించారు. అయితే పోలీస్ ఉద్యోగాల్లో వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఇస్తూ యువ‌త హృద‌యాల‌ను దోచుకున్నారు. తాజాగా ఇపుడు ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 42 రోజుల పాటు జరిగిన సకలజనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ టీఎన్జీవో నాయకుడు దేవీప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజులలో వెలువడనున్నాయని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించినందుకు ఆయన సీఎం కేసీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు.

సెప్టెంబ‌ర్ 13 2001 నుంచి అక్టోబ‌ర్ 24, 2011 వ‌ర‌కు 42 రోజుల పాటు స‌క‌ల జ‌నుల స‌మ్మె జ‌రిగింది. మొత్తంగా ఈ ప్ర‌క‌ట‌న ద్వారా కేసీఆర్ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News